తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వై.ఎస్.ఆర్ జగనన్న భూ హక్కు – భూ రక్ష పథకంలో భాగంగా రాష్ట్రంలో భూముల రీ సర్వే డ్రాఫ్ట్ ఆర్ ఓ ఆర్ ఈనెల 15 , కలెక్టర్ల చే డాటా వెరిఫికేషన్ ఈ నెల 22 నాటికి పూర్తి చేయాలని నవంబర్ మాసంలో ముఖ్యమంత్రిచే భూ హక్కు – భూ రక్ష పత్రాల పంపిణీకి సిద్డం కావాలని సిసిఎల్ఎ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం అమరావతి నుండి సి సి ఎల్ ఎ చీఫ్ సెక్రటరీ, కమిషనర్ సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ సిద్ధార్థ్ జైన్ తదితర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్ లు, జాయింట్ కలెక్టర్ లతో, సర్వే అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించగా జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్, జే.సి. డి కే బాలాజీ , డి ఆర్ ఓ శ్రీనివాసరావు , జిల్లా సర్వే అండ్ లాండ్ రికార్డ్స్ అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో వున్న 1051 గ్రామాల రీ సర్వే కు సంబందించి నిర్దేశించిన మేరకు 69 గ్రామాలకు గాను 65 గ్రామాల్లో డ్రాఫ్ట్ లాండ్ రిజిస్టర్ మరియు 13 నోటిఫికేషన్ పూర్తి చేసి ఫైనల్ ROR పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. మిగిలిన 4 గ్రామాల్లో కూడా వెంటనే పూర్తి చేయనున్నామని కలెక్టర్ వివరించారు. పెండింగ్ మ్యుటేషన్ , ఆర్ ఓ ఆర్ పబ్లిష్ పై దృష్టి పెట్టి సకాలంలో పూర్తి చేస్తామని, నిర్దేసించిన సమయానికి హక్కు పత్రాలను రైతులకు అందచేయడానికి సిద్దంగా వుంటామని వివరించారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టులుగా చేపట్టిన జిల్లాలోని చంద్రగిరి మండలం నరసింగాపురం, చిల్లకూరు మండలం యోగేస్వరుని పల్లి, గూడూరు మండలం రెడ్డి గుంట, నాయుడుపేట మండలం తిమ్మాజీకండ్రిగ గ్రామాలలో సచివాలయ స్థాయిలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుచున్నాయని వివరించారు. సమావేశ అనంతరం జిల్లా కలెక్టర్ సర్వే అధికారులకు, సిబ్బందికి దిశా నిర్దేశం చేసారు.