తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో బి.ఎం.సి.యు, ఏ.ఎం.సి.యు భవన నిర్మాణాలతో పాటు మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్ గోడౌన్ల స్థల సేకరణ వేగవంతం చేయాలని మార్కెటింగ్ శాఖ కమీషనర్ ప్రద్యుమ్న తెలిపారు. గురువారం అమరావతి నుండి కమిషనర్ & రిజిస్ట్రార్ కో – ఆపరేటివ్ సొసైటీస్ అహ్మద్ బాబు మరియు మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న సంయుక్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ లు, జిల్లా సహకార అధికారులు, మార్కెటింగ్ శాఖల అధికారులతో వర్చువల్ విధానంలో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
జాయింట్ కలెక్టర్ డి.కే.బాలాజీ వివరిస్తూ రైతు భరోసా కేంద్రాలకు అనుబంధంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు మల్టీ పర్పస్ ఫెసిలిటీ సెంటర్స్ లో భాగంగా మొదటి దశలో 30 గోడౌన్ల సంబంధించి గ్రౌండింగ్ పూర్త అయి నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. రెండవ దశలో 29 గోడౌన్లకు సంబంధించి స్థల సేకరణ పూర్తి ఆయి నిర్మాణాలను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మూడవ దశలో 86 గోడౌన్ల కు గుర్తించే ప్రక్రియలో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ ప్రాముఖ్యత అంశమైన జగనన్న పాల వెల్లువపై మాట్లాడుతూ జిల్లాలో 218 బి ఎం సి యు (బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్ )లకు గానూ 216 బి ఎం సి యు లకు మరియు 623 ఏ.ఎం సి యు (ఆటోమేటిక్ మిల్క్ కూలింగ్ సెంటర్స్) కు గానూ 533 ఏఎంసియు లకు స్థల సేకరణ చేయడం జరిగిందని మిగిలిన 90 ఏఎంసియు లకు సంబంధించిన స్థల సేకరణ నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా కో ఆపరేటివ్ అధికారి ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.