-బ్యాంకర్లు నిరుద్యోగ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రుణాలు మంజూరులో సహకరించాలి:
-తిరుపతి జిల్లా పరిశ్రమలకు అన్ని విధాలా అనుకూలం: ఎం పి గురుమూర్తి
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాన మంత్రి ఉపాధి కల్పనపై ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల మిషన్ ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అవగాహన సదస్సు కు ముఖ్య అతిథిగా గౌ తిరుపతి ఎం పి మద్దెల గురుమూర్తి హాజరయ్యారు.
ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎం పి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి అనేక పథకాలు యువతకు అమలు చేయబడుతున్నాయి అని అందులో PMEGP కార్యక్రమం నిరుద్యోగ యువతకు ఎంతో అద్భుతమైనదని అన్నారు. ఈ సబ్సిడీ కోసమని కాకుండా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు MSME కింద యూనిట్లను స్థాపించే విధంగా పూర్తి స్థాయి ప్రాజెక్ట్ రిపోర్ట్ తో బ్యాంకుల ను అప్రోచ్ అవ్వాలని సూచించారు. ఎందుకు ఈ అవగాహన సదస్సు అవసరం అంటే మిగిలిన అన్ని జిల్లాల్తో పోలిస్తే భౌగోళికంగా మనకు అన్ని వనరులు ఉన్నాయనీ బెంగళూర్ చెన్నై నగరాలు, రోడ్, రైల్, విమాన మార్గాలు ఉన్నాయని అంతే కాకుండా మనకు తిరుమల శ్రీవారి ఆలయం ఉండడం వలన దర్శనానికి వచ్చే భక్తులు ఎక్కువ ఉన్నారని అందుకే ఇక్కడ అతిథ్య రంగం ఇతర రంగాలకు మంచి అవకాశం ఉందని అన్నారు. చైనా లాంటి దేశాలలో చిన్న చిన్న పరిశ్రమలకు అక్కడ ఏర్పాటుకు ప్రోత్సహం ఉందనీ, జగనన్న ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, పరిశ్రమలకు పెద్ద పీట వేశారని గుర్తు చేశారు. ఇక్కడ ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయని, మంచి పరిశ్రమలు స్థాపించి నిరుద్యోగాన్ని పారద్రోలడానికి బ్యాంకులు సహకరించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అందే సబ్సిడీ లు వినియోగించుకుని KVIC/ KVIB వారి సహకారంతో ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీ, అలానే మార్కెట్ డిమాండ్ ఉన్న యూనిట్లను ఏర్పాటు చేయాలని అప్పుడే లాభాలు వస్తాయని అన్నారు. బ్యాంకర్లు తమకు అందిన రుణాలకు సంబంధించిన లోను దరఖాస్తులను సత్వరమే మంజూరు చేయాలని కోరారు. హస్తకళల అభివృద్ధి సంస్థ వారితో సంయుక్తంగా హస్త కళాకారులను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవడానికి గౌ. ముఖ్యమంత్రి దృష్టికి కొన్ని అంశాలను తీసుకెళ్లానని అన్నారు.
కేంద్ర KVIC డైరెక్టర్, ఏపీ గ్రీప్ మాట్లాడుతూ PMEGP కార్యక్రమం కింద మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల స్థాపనకు 50 లక్షల వరకు,. సేవా రంగంలో 20 లక్షల వరకు బ్యాంకు నుండి రుణాలు అందిస్తూ కేంద్ర సబ్సిడీ 35% వరకు జమ చేయడం జరుగుతుందని తెలిపారు. లబ్దిదారుల వాట 5% నుండి 10% వరకు ఉంటుందని తెలిపారు. నూతన మైక్రో యూనిట్ల స్థాపనకు మాత్రమే ఆర్థిక సహాయం లభిస్తుంది అని తెలిపారు. PMEGP/MUDRA/ REGP ద్వారా వ్యాపార అభివృద్ధి కి 2వ లోను కోటి రూపాయల దాకా బ్యాంకు రుణాలు అందించే అవకాశాలు ఉన్నాయని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఏపీ ఖాదీ బోర్డు మెంబర్ దుద్దెల బాబు మాట్లాడుతూ గౌ ఎం పి చొరవ తో ఈ కార్యక్రమం జరపడం ఎంతో ఆనందంగా ఉందని, బ్యాంకర్లు యువతను ప్రోత్సహించి గైడ్ చేసి వారికి రుణాలు మంజూరు చేయాలని కోరారు.
జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమం గౌ ఎం పి గారి చొరవతో ఏర్పాటు చేయబడిన బృహత్తర కార్యక్రమం అని ఇందులో సబ్సిడీ కంపొనెంట్ ఎక్కువ ఉందనీ ఇప్పుడు కొత్త స్కీములు డైరీ, షీప్, ఆక్వా కల్చర్ లాంటి వాటిని చేర్చడం జరిగిందనీ నిరుద్యోగ యువత వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల ఎ డి వరప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర స్థాయిలో ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కు నోడల్ ఏజెన్సీ గా, జిల్లాలో పరిశ్రమల శాఖ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ గా ఉంటుందని తెలిపారు. గ్రామీణ యువత ఈ పథకం మీద అవగాహన కల్పించుకుని ఉపయోగించుకుని లబ్ధి పొందాలని కోరారు. http://www.kviconline.gov.in/pmegpeportal వెబ్సైట్ లో పూర్తి వివరాలు పొందు పరచబడి ఉన్నాయని తెలిపారు. ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని కోరారు.
ఎల్ డి ఎం సుభాష్ మాట్లాడుతూ బ్యాంకర్లు అన్ని విధాలా PMEGP, MSME రుణాలు మంజూరు చేయాలని అన్ని బ్యాంకులు సహకరిస్తాయి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ జయకుమార్, యూనియన్ బ్యాంక్ RM రాంప్రసాద్, SBI AGM మురళి, గిరిజన సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య, సి ఇ ఓ సెట్విన్ మురళి కృష్ణ, KVIC AD కోటి రెడ్డి, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు.