-ఉత్తరాంధ్ర అభివృద్దికి ఏ పోరాటానికైనా సిద్దం…
-విశాఖా పరిపాలనా రాజధానిగా కావాలి…
-రాష్ట్ర మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు
పలాస, నేటి పత్రిక ప్రజావార్త :
మూడు పెళ్ళిళ్లు కి మూడు రాజధానులకు ముడిపెట్టిన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు సరికాదని రాష్ట్ర పసుసంవర్ధక, మత్సశాఖ, పాడి పరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఆదివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జనసేన కార్యకర్తల తీరు సరికాదని హెచ్చరించారు. ప్రజాస్వామ్య విలువలకు లోబడి రాజకీయ పార్టీలు తమ తమ పనులు చేపడతాయని అవి ప్రజలకు మేలు చేకూర్చాలే కానీ నష్టం చేయకూడదని తెలిపారు. రాజధాని వికేంద్రీకరణ జరిగేందుకు ఉత్తరాంధ్రా ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారని వారికి ధన్యావాదాలు తెలిపారు. విశాఖ గర్జన కు వచ్చి తిరుగు ప్రయాణం అయిన వారిపై జనసేన వాల్లు చేసిన దాడి హేయమైన చర్య అంటూ తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. విశాఖ గర్జన ఒక చరిత్ర,కుండ పోత వర్షంలో ఏ ఒక్కరిలో చైతన్యం తగ్గకుండా గుండెల నిండా స్పూర్తి నింపుకొని అందరూ వచ్చారు. చరిత్ర పుటల్లో విశాఖ గర్జన నిలుస్తోంది. అంతటి గొప్ప ఉద్యమ స్పూర్తి దెబ్బతీయాలని పవన్ కళ్యాణ్ ఆలోచనలా ఉంది. ప్రతి యాక్ట్ కి ఒక రేటు ఉంది అనేది నిన్న జరిగిన సంఘటన. చిల్లరగాల్లు చేసే పనులే నిన్న ఎయిర్‌పోర్టు దగ్గర ఘటన. చంద్ర బాబు ఆడుతున్న నాటకంలో పవన్ కు అవగాహన లేకుండా చేస్తున్న పనులు ఇలానే ఉంటాయి. జనసేన సైనికులు ప్రజల కోసం పని చేసేలా మెలగాలని కక్షపూరిత చర్యలకు పాల్పడకూడదని అన్నారు.
పవన్ చేసిన వ్యాఖ్యలు నాకు బాదించాయి అన్నారు. ఉత్తరాంధ్ర నాయకుడిగా నాకు బాదించింది. మూడు పెళ్లిల్లు చేసుకున్నా నాకు మూడు రాజధానులు కావాల అనడం పవన్ తగదు. వల్లయ కొవ్వు ఎక్కి చేసుకున్న నీ మూడు పెళ్లిల్లకు రాజధానులు విషయం ముడి పెడతావా. మాది కడుపు మంటతో ఉద్యమం పవన్ ది ఒల్లు కొవ్వు ఎక్కిన పనులు. జనసేన నాయకులు,కార్యకర్తలు,ప్రజలు ఒక విషయాన్ని గమనించాలి. తెలుగుదేశం కార్యాలయం లో రాసిచ్చిన స్క్రిప్ట్ తో పాటు ఆయన హావభావాలకు ఒక్కో రేటు కట్టిన ప్యాకేజీ పవన్ అనే విషయం గమనించాలి. మానవ విలువలు తెలియక నైతిక విలువలు లేని వాడు పవన్. మూడు
అధాని వాల్లకు 15 వందల కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టబోతుంది. సీఎం జగన్ వలన అధాని రాబోతుంది. కియా మోటర్స్ అధనంగా పెట్టుబడులు పెడుతుంది. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే చదవడం కాదు నిజాలు తెలుసు కోండి. అమర్ రాజ బ్యాటరీష్ ఎక్కడికి వెల్లిపోయారు. గ్రీన్ యనర్జీ రంగం వస్తున్న పెట్టుబడులు నీకు కనిపించడం లేదా పవన్ నీకు కల్లు దొబ్బాయా. దావోస్ కి జగన్ ఎన్ని సార్లు వెల్లారు.
చంద్రబాబు 60 వేల కోట్లు పెట్టుబడులు వస్తే… జగన్ హయాం లో 40 వేల కోట్లు వచ్చాయి. ఐఎన్ఐ డిపార్ట్మెంట్ చెప్పినట్లు దేశంలో ఆంద్రప్రదేశ్ ఇప్పుడు మొదటి స్థానంలో ఉంది. గ్యాప్ టైం లో ఆదాయం సంపాదించే ఏకైకా రాజకీయ నాయకుడు. సినిమాల్లో ప్రాజెక్టు కొన్ని కొట్లు సంపాదించే మీరు. రాజకీయాల్లో ఈవెంట్ కి కొన్ని కోట్లు సంపాదిస్తున్నది మీరే పవన్. గతంలో మీరు చంద్రబాబు మీద చేసిన విమర్శలు మాకు గుర్తు ఉన్నాయి పవన్. రాజ్యాంగంలో నిపుణులు కమిటీ ఇచ్చిన సలహాలను ఇప్పుడు పాటిస్తున్నాము. చంద్రబాబు వేసిన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాలను
ఐవైఆర్ క్రిష్ఞారావు గతంలో వ్రాసిన పుస్తకం మీ చేతులు మీదుగే ప్రారంబించారు వాటిని మీరు గమనించకపోతే ఎలా. ఒక స్థిరమైనటువంటి లక్ష్యం కలిగి ఉన్నామని చెప్పుకుంటున్న మీలాంటి వారు ఇలా ప్రవర్తిస్తే ఎలా. నాయకుడుగా కొన్ని విషయాలు మీరు అవగాహన చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను తెలుసుకోవాలి. విశాఖపట్నం పరిపాలనా రాజధాని అయితే అభువృద్ది చెంది ఉత్తరాంధ్ర వలసలు పూర్తిగా నిర్మూలన అవుతాయి.