Breaking News

కలెక్టరేట్ లో యధావిధిగా సోమవారం జిల్లా స్థాయి స్పందన కార్యక్రమం…  

-కలెక్టర్ డా కే.మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం (17.10.2022) స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించడం జరుగుతుందని  జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం  రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజల నుంచి స్పందన ఫిర్యాదులు స్వీకరిస్తామని ఆమె తెలిపారు.  జిల్లా కలెక్టర్, జేసీ, ఇతర జిల్లా అధికారులు  ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తామని కలెక్టర్ మాధవీలత తెలిపారు. ప్రతి వారం తరహాలోనే సోమవారం రాజమహేంద్రవరం రూరల్ లో హర్లిక్స్ ఫ్యాక్టరీ  సమీపంలోని ఎన్ఎసి భవనంలోని కలెక్టరేట్ నకు ఆర్టీసి బస్టాండ్ నుంచి ఉచిత బస్సు సర్వీసు ఉ.9 నుంచి మ.2 వరకు నడుపుతున్నట్లు ఆమె తెలియచేశారు. ప్రజలు వ్యయ ప్రయాసలకు లోను కాకుండా వారికి సంబంధించిన స్పందన ఫిర్యాదులను అయా రెవెన్యూ, మునిసిపల్, మండల, గ్రామ, వార్డు సచివాలయాలలో  అందచేయ వలసినదిగా ఆమె కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *