మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
దేశంలో వ్యవసాయ రంగానికి అత్యధిక మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తున్న రాష్ట్రం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రమేనని, కృష్ణాజిల్లా ఏడు నియోజకవర్గాలలో మొత్తం 490 గ్రామాలలో 1,50,213 మంది రైతులకు 67 కోట్ల 98 లక్షల 17 వేల 500 రూపాయలు వైఎస్సార్ రైతు భరోసా – పిఎం కిసాన్ పథకం కింద ప్రభుత్వం అందచేస్తున్నట్లు మాజీ మంత్రివర్యులు,మచిలీపట్నం శాసనసభ్యులు, కృష్ణాజిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పేర్ని వెంకట్రామయ్య (నాని) ప్రకటించారు.
వైఎస్సార్ రైతు భరోసా – పిఎం కిసాన్ పథకం జిల్లా స్థాయి కార్యక్రమం సోమవారం మచిలీపట్నం జిల్లా పరిషత్ సమావేశపు మందిరంలో నంద్యాల లోని ఆళ్లగడ్డ నుంచి ముఖ్యమంత్రి ప్రత్యక్ష ప్రసారం నేరుగా వీక్షించేందుకు ఏర్పాటు చేసారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుండి పలువురు రైతులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తొలుత మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ, పర్యావరణానికి, ప్రజారోగ్యానికి సేంద్రీయ వ్యవసాయం ఎంతో మేలుచేస్తుందని, పెట్టుబడులు తగ్గడంతో పాటు ఆరోగ్యకర సమాజాన్ని నిర్మించాలని ఆ దిశగా వ్యవసాయ అధికారులు కర్షకులను ప్రోత్సాహించాలని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కౌలు రైతులు, ఆర్‌వోఎఫ్‌ఆర్ అటవీ, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతన్నలకు కూడా వైఎస్సార్ రైతు భరోసా కింద పంట పెట్టుబడి ఖర్చు భారాన్ని తగ్గించేందుకు ఏటా రూ.13,500 రైతు భరోసా సాయాన్ని ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి ఏటా 50 లక్షలకు పైగా రైతన్నలకు ప్రతి ఏటా సుమారు రూ.7వేల కోట్ల రైతు భరోసా సాయాన్ని ప్రభుత్వం ఇస్తోంది. రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ యోజన కింద వరుసగా నాలుగో ఏడాది రెండో విడత నిధులు జమ కావడం ఎంతో హర్షణీయమన్నారు. ప్రతి ఏటా మూడు విడతల్లో రూ.13,500 రైతు భరోసా సాయం, నాలుగో ఏడాది మొదటి విడతగా ఈ ఏడాది మే నెలలో ఖరీఫ్‌కు ముందే రైతన్నలకు ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున ఇప్పటికే ప్రభుత్వం అందజేసిందన్నారు. ఈ రోజు రెండో విడతగా పంట కోతకు, రబీ అవసరాలకు ఒక్కొక్కరికి మరో రూ. 4,000 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 50.92 లక్షల మంది రైతన్నలకు రూ. 2,096.04 కోట్ల రైతు భరోసా సాయాన్ని నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో ముఖ్యమంత్రి బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారని అన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా మాట్లాడుతూ దేశానికి ఆహరం అందించే రైతులకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉంటారని రైతన్నల హర్షద్వానాల మధ్య పేర్కొన్నారు. సోమవారం కృష్ణా జిల్లాలోని 1,50,213 రైతు కుటుంబాలకు రూ.67.98 కోట్ల రూపాయలు నేరుగా రైతుల బ్యాంక్ అక్కౌంట్ లోనికి జమచేయడం జరుగుతుందన్నారు. కృష్ణాజిల్లాలో ఈ-క్రాప్ 100 శాతం పూర్తయిందని, అలాగే ఈ – కెవైసీ 85 శాతం పూర్తయినట్లు తెలిపారు. వై.ఎస్.ఆర్ రైతు భరోసా పి.యం. కిసాన్ పథకం కింద పెట్టుబడి సాయంగా సన్న, చిన్నకారు, ఇతర రైతులందరికీ సంవత్సరానికి రూ. 13,500/ చొప్పున (రూ.7500/- రాష్ట్ర ప్రభుత్వం రూ 6000/- కేంద్ర ప్రభుత్వం వారి పి.ఎం. కిసాన్ పథకం) వారి బ్యాంక్ ఖాతాలకు నేరుగా జమ చేయడం జరుగుతుంది. 5 సంవత్సరాల పాటు అందించే పెట్టుబడి సాయం రైతులకు సాగుకు కావలసి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు కొనుగోలుకు, ఇతర వ్యవసాయ ఖర్చులకు ఉపయోగపడుతుందని కలెక్టర్ అన్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలోని 27 గ్రామాలలో 8,940 రైతులకు 3 కోట్ల 92 లక్షల 50 వేల రూపాయలు, పెడన నియోజకవర్గంలోని 90 గ్రామాలలోని 25,602 రైతులకు 11 కోట్ల 24 లక్షల 59 వేల రూపాయలు, అవనిగడ్డ నియోజకవర్గంలోని 77 గ్రామాలలో 33 వేల 059 మంది రైతులకు 14 కోట్ల 58 లక్షల 81 వేల 500 రూపాయలు, పామర్రు నియోజకవర్గంలో 105 గ్రామాలు 33,171 మంది రైతులకు 15 కోట్ల 42 లక్షల 84 వేల రూపాయలు, గుడివాడ నియోజకవర్గంలోని 65 గ్రామాలలో 12,346 రైతులకు 5 కోట్ల 70 లక్షల 75 వేల 500, పెనమలూరు నియోజకవర్గంలో 42 గ్రామాలలో 11,078 రైతులకు 5 కోట్ల 59 లక్షల 88 వేల రూపాయలు, గన్నవరం నియోగకవర్గంలో 84 గ్రామాలలో 26,017 మంది రైతులకు 11 కోట్ల 48 లక్షల 79 వేల 500 రూపాయలు వైఎస్సార్ రైతు భరోసా – పి ఎం కిసాన్ పథకం కింద అందచేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వ్యవసాయ యంత్ర పరికరాల ప్రదర్శనను తిలకించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల, వ్యవసాయ సలహా కమిటీ ఛైర్మెన్ జన్ను రాఘవరావు, మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ తంటిపూడి కవితా థామస్, కృత్తివెన్ను జడ్పిటీసి సభ్యురాలు మైలా రత్నకుమారి, మచిలీపట్నం వ్యవసాయ సలహా కమిటీ సభ్యుడు చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
Tags machilipatnam
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …