అవనిగడ్డ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 20వ తేదీ రాష్ట్ర ముఖ్యమంత్రి అవనిగడ్డ పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. రంజిత్ భాష, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల తో కలసి ముఖ్యమంత్రి కార్యక్రమం ఏర్పాట్లు పరిశీలించారు. షరతులు గల పట్టాలు నిషేధిత జాబితా 221a నుండి తొలగించి రైతులకు వెసులుబాటు కల్పించేందుకు ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని అన్నారు.
వేకనూరు గ్రామం వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిపాడ్ ఏర్పాట్లు పనులు పరిశీలించిన కలెక్టర్ ఎలిప్యాడ్ వద్ద అవసరమైన బారికేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు
ముఖ్యమంత్రి సభా కార్యక్రమానికి కోడూరు, నాగాయలంక, అవనిగడ్డ,మోపిదేవి, ఘంటసాల, మొవ్వ, మచిలీపట్నం మండలాల నుంచి లబ్ధిదారులను ముఖ్యమంత్రి సభకు హాజరయ్యేందుకు అవసరమైన బస్సులు ఏర్పాటు చేయాలన్నారు.
సభా ప్రాంగణం పరిశీలించిన కలెక్టర్ వేదిక ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
వివిధ మండలాల నుంచి 20 మంది షరతులు గల పట్టాలు కలిగిన లబ్ధిదారులను గుర్తించాలని, వారితో ముఖ్యమంత్రి ఫోటో సెషన్ ఉంటుందన్నారు.
డయాస్‌పై పదిమంది రైతులకు నిషేధిత భూముల తొలగింపు పత్రాలు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇప్పించుటకు ఏర్పాటు చేయాలన్నారు.
ఇద్దరు రైతులు డయాస్‌పై నిషేధిత భూములు తొలగింపు వల్ల కలిగే ప్రయోజనాలు వివరించేందుకు ఏర్పాటు చేయాలన్నారు.
ఎలిప్యాడ్ వద్ద నుండి సభాస్థలి వరకు బారికేడింగ్ పనులు పూర్తి చేయాలన్నారు.
సభకు హాజరయ్యే వారికి ఆహారం, మంచినీరు అందించే ఏర్పాట్లు చేయాలన్నారు ట్రాఫిక్ జాములు ఏర్పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో డి ఆర్ ఓ ఎం వెంకటేశ్వర్లు, జెడ్పి సీఈవో జి శ్రీనివాసరావు, డ్వామా పిడి జీవి సూర్యనారాయణ, డీఎస్ఓ పార్వతి తదితరులు పాల్గొన్నారు.
Tags avanigadda
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …