-జిల్లాలో 1,31,084 మంది రైతులకు రూ.6 కోట్లు ఖాతాలలో జమ…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రైతులు ఆనందంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే దృడ నిశ్చయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వైఎస్సార్ రైతు భరోసా పథకానికి క్రమం తప్పకుండా అమలు చేసి వ్యవసాయం పై రైతులకు భరోసా కల్పింస్తున్నారని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు.
వైఎస్సార్ రైతు భరోసా పథకం కింద జిల్లాలో 2022`23 సంవత్సరానికి రెండవ విడతలో భాగంగా సోమవారం విజయవాడలోని వ్యవసాయ అధికారుల సంఘ భవనంలో నిర్వహించిన వైఎస్సార్ రైతు భరోసా పంపిణీ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు, శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్, వెలంపల్లి శ్రీనివాసరావు శాసనమండలి సభ్యులు రహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, తదితరులతో కలిసి రైతులకు ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఏడాది మూడు విడతల్లో రైతులకు రైతుభరోసా కింద ఒక్కొక్కరికి 13,500 రూపాయలను ప్రభుత్వం ఆర్థిక సహాయంగా అందించడం జరుగుతుందన్నారు. మెదటి విడత రైతు భరోసా కింద 5500 రూపాలయ చొప్పున జిల్లాలో 121711 మంది రైతులకు 66.94 కోట్ల రూపాయలు వారి ఖాతాలలో జమ చేయడం జరిగిందన్నారు. రెండవ విడతలో భాగంగా సొంత భూమి కలిగిన రైతు కుంటుంబాలకు అటవీ భూములు సాగు చేస్తున్న రైతు కుటుంబాలకు 4 వేల రూపాయలు సొంత భూమి లేని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ రైతులకు నూతనంగా నమోదైన రైతులకు కలిపి జిల్లాకు చెందిన 1,31,084 మంది రైతులకు 11,500 చొప్పున 59.83 కోట్లు రూపాయలు నేడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాల జిల్లా అలగడ్డలో బటన్ నొక్కి రైతుల ఖాతాలలో జమ చేశారన్నారు. ప్రభుత్వం రైతు భరోసాతో పాటు రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ, ఉచిత పంట భీమా, ఉచిత వ్యవసాయ విద్యుత్ పంపిణీ, సూక్ష్మసెధ్యం, పండ్ల తోటల అభివృద్ధికి సహాయం అందించి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోందన్నారు. ప్రకృతి విపత్తుల వలన పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించడం, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల పంటలకు గిట్టుబాటు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నూతనంగా ఏర్పడిన ఎన్‌టిఆర్ జిల్లాలో మెట్టప్రాంతంలో రైతులు పత్తి మిర్చి వంటి పంటలో పండిస్తున్నారని రైతు భరోసా కేంద్రాల ద్వారా నూతన సాగు పద్దతిపై అందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చీడ పీడలను తట్టుకునే విధంగా విత్తనాలను ఎంపిక చేసుకుని విత్తన శుద్ది చేసి నాటాలని కలెక్టర్ తెలిపారు.
శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్ మాట్లాడుతూ రైతుల కష్టం తెలిసిన ముఖ్యమంత్రి రైతన్నకు భరోసా కల్పించేందుకు వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదని నమ్మిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోన్‌రెడ్డి అని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. సొంత భూమిని సాగు చేసుకుంటున్న రైతులతోపాటు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టి కౌలు రైతులకు కూడా రైతు భరోసా కల్పించి రైతు పక్షపాతిగా జగనన్న చిరస్థాయిగా రైతు హృదయాలలో నిలుస్తారన్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్ర ద్వారా రైతు కష్టాలను చూసి వారిని ఆదుకోవాలని దృడ సంకల్పంతో ఆర్థిక లోటు ఉన్నప్పటికి క్రమం తప్పక రైతులకు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. వ్యవసాయం దడగ అని గత ప్రభుత్వం చేసిన విమర్శలను పట్టాపంచలు చేస్తూ వ్యవసాయాన్ని రైతులు పండుగా చేపడుతున్నారన్నారు. గత మూడేళ్ళలో రైతన్నలకు ఇప్పటి వరకు దాదాపు లక్ష 33 వేల, 526 కోట్లకు పైగా ఆర్థిక సహాయం అందించడం ముఖ్యమంత్రికి రైతుల పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనమన్నారు.
శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ నేడు రెండవ విడత అందించే రైతు భరోసా రైతుల పంట కోతకు రబీ అవసరాలకు ఉపయోగపడుతాయన్నారు. చెప్పిన దానికన్న ముందుగా మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా రైతులకు సాయం చేస్తున్న ఎకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాత్రమేనన్నారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ రైతులకు సహాయకారిగా ఉండేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి విత్తనాలు, ఎరువులు పురుగుమందులు రైతుకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.ఈ `క్రాప్ విధానం ద్వారా రైతు పంటలను నమోదు చేసి ప్రభుత్వమే భీమా సొమ్ము చెల్లించి నష్టపోయిన రైతులకు భీమా సౌకర్యాం అందించడం ఏ రాష్ట్రంలోను లేదన్నారు. పంటను నాటిన నాటినుండి పంట అమ్మకంవరకు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సూచనలు సలహాలు అందించడం జరుగుతుందన్నారు.
శాసనమండలి సభ్యులు రహుల్లా మట్లాడుతూ వ్యవసాయ శాఖ ద్వారా రైతన్నకు గడప వద్దకే నాణ్యమైన ఎరువులు పురుగుమందులు పంపిణీ చేస్తున్నారన్నారు. పాదర్శకతకు పెద్ద పీట వేస్తూ ఆర్‌బికెల ద్వారా అర్హుల జాబితాలను ప్రదర్శించి పంట నష్టాన్ని ఇన్‌పుట్ సబ్బిడీని అందించడం పట్ల రైతన్నాలు ఆనందాని వ్యక్తం చేస్తున్నారన్నారు.
కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ దామోదరరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి విజయభారతి,డిడి పి మాధవిలత, డిప్యూటి ప్రాజెక్టు మేనేజర్ విజయకుమారి, ఆర్టికల్చర్ ఆఫీసర్ బాలాజీ, జిల్లాకు చెందిన ఎడిఎలు బి.వెంకటేశ్వరావు, యం శ్రీనివాసరావు, డి. రమణ మూర్తి, సిహెచ్ శ్రీనివాసరావు, జి. కెనడి, జె. కృష్ణజ్వోతి, బి పద్మజ, యం రత్నశ్రీ, ఎవిఎన్ అనితభాను, యం స్వప్న, మండల వ్యవసాయ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News