విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిబంధనలకు విరుద్ధంగా సంస్కరణల పేరుతో తమ శాఖలో సిబ్బంది అధికారాలను కుదించవద్దని, సీనియర్, జూనియర్ ఆడిటర్‌లను, ఏ, బీ, సీ, డీ కేటగిరీలుగా విభజించవద్దని, గ్రామ పంచాయతీల్లో టీం ఆడిటర్ అధికారుల అధికారాలు కుదించవద్దని తదితర డిమాండ్లతో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆడిట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగులు మంగళవారం గాంధీనగర్, ధర్నాచౌక్‌నందు ‘రిలే నిరాహారదీక్ష’ చేపట్టారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆస్కారరావు ఈ దీక్షలో పాల్గొని సంఫీుభావం తెలిపి మాట్లాడుతూ ప్రభుత్వ ఖజనాను బలోపేతం చేసే ఆడిట్ ఉద్యోగులు రోడ్డెక్కడానికి కారణం ఆ శాఖ డైరెక్టర్ వ్యవహారశైలే అని ఆరోపించారు. ఆయన ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నియంతృత్వ ధోరణితో ముందుకు వెళ్తున్నారని తెలిపారు. ఇప్పటికైన ప్రభుత్వ ఆర్థికశాఖ జోక్యం చేసుకొని ఆడిట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక సంయుక్త సమావేశం నిర్వహించాలని కోరారు. దీర్ఘకాలిక సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.వి.ఎస్.ఎన్.రవిశంకర్, ఎం. అబ్రహంలు మాట్లాడుతూ తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, ఉద్యోగులపై డైరెక్టర్ వేధింపులు, విభజించి పాలించడం వంటి చర్యలు మానుకోవాలని, లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాగసాయి, సత్యనారాయణబాబు, జయపాల్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …