విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మంగళవారం విజయవాడ మారిస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో యూ జీనియస్ నేషనల్ క్విజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా 18 జిల్లాల నుంచి 400 పాఠశాలలకు చెందిన 850 మంది విద్యార్థులు క్విజ్‌లో పాల్గొన్నారు. తొలుత ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించి 6 జట్లను ఫైనల్ రౌండ్ ఎంపిక చేశారు. వీరికి జనరల్ అవేరేనెస్, బిజినెస్‌కు సంబంధించిన క్విజ్ పోటీలు నిర్వహించి, ఉత్తమ ప్రతిభ కనపరిచిన జట్టును యూ జీనియస్‌గా ఎంపిక చేశారు. ముఖ్య అతిథి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ సిగిలి షన్మోహన్ హాజరై విజేతలకు బహమతులు అందజేశారు. సిగిలి షన్మోహన్ మాట్లాడుతూ విద్యార్థులు ఆసక్తి ఉన్న సబ్జెక్టులపై పట్టు సాధించాలని సూచించారు. జీవితంలో పట్టుదలతో లక్ష్యసాధన చేయాలన్నారు. విద్యార్థులు విద్యార్థి దశ నుంచే ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని, దానికి తగ్గట్టుగా ఉన్నతంగా చదవాలని సూచించారు. విజేతలకు బ్యాంకు ఉన్నతాధికారులు సర్టిఫికెట్లు, బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్ నవనీత్ కుమార్, డిప్యూటీ జోనల్ హెడ్ పీవిజేఎన్. మూర్తి, డీజీఎం వేగే రమేష్, రీజనల్ హెడ్ రజనీకాంత్, చీఫ్ మేనేజర్ కరణం జయశ్యామ్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …