తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎండియు ఆపరేటర్లకు మరియు రేషన్ షాప్ డీలర్ల కు అదనపు ఆదాయం కల్పించే దిశగా ఆయిల్ ఫెడ్ జిసిసి లు వారి ఉత్పత్తులను ఎండియుల ద్వారా సామాన్య ప్రజలకు బహిరంగ మార్కెట్ లోని ధరల కన్నా తక్కువగా సరసమైన ధరలలో అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని జెసి చాంబర్లో ఆయిల్ ఫెడ్, జిసిసి, పౌరసరఫరాల అధికారులు, ఎండియు ఆపరేటర్లు, రేషన్ షాపు డీలర్లు తదితరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోనే తొలిసారిగా వైజాగ్ తిరుపతి రెండు జిల్లాలలో జిసిసి ఆయిల్ ఫెడ్ ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులో ఉంచి వీరికి మార్కెటింగ్ తో పాటు, ఎండియు ఆపరేటర్లకు మరియు డీలర్ల కు అదనపు ఆదాయం కల్పించే దిశగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ప్రణాళిక బద్ధంగా చేపడితే మంచి ఫలితాలు ఉంటాయని అన్నారు. దీనికిగాను ఎండియు ఆపరేటర్లు మరియు రేషన్ షాప్ డీలర్లు, జిసిసి, ఆయిల్ ఫెడ్ లు ఒక అవగాహనకు వచ్చి వారు సరఫరా చేసే ఉత్పత్తుల వివరాలు, రేట్లు, వారి గోడౌన్లు తదితరాలు బేరిజు వేసుకొని మంచి ఫలితాలు వచ్చే విధంగా చక్కటి ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు ఈ సందర్భంగా జిల్లాలో నాలుగు రెవెన్యూ డివిజన్లలో వారికి సంబంధించిన ఉత్పత్తులను ప్రదర్శించి ఎండియు ఆపరేటర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని వాటికి ప్లాన్ తయారు చేయాలని తెలిపారు. ఎండియు ఆపరేటర్లు ఇంటింటికి నిత్యావసర సరుకులు అందించేటప్పుడు వారు కొనాలకున్న ఉత్పత్తులకు సంబంధించిన డిమాండ్ అంచనా వేసుకొని కొని ఉత్పత్తులను సరిపడా అందుబాటులో ఉంచుకోగలిగితే లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని సూచించారు. జిల్లా యంత్రాంగం బాధ్యత ఎండియు ఆపరేటర్లకు అవగాహన కల్పించుటకు వేదిక ఏర్పాటు చేయడం వరకే అని, ఉత్పత్తులు కొనాలా వద్దా అనేది ఎండియు ఆపరేటర్లు మరియు రేషన్ షాప్ డీలర్లు నిర్ణయానికి వారు చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా ఆయిల్ ఫెడ్ అధికారి విజయ బ్రాండ్ వంట నూనె ఎంతో నాణ్యమైనదని, జిసిసి వారు మంచి తేనె, కాఫీ పొడి, సబ్బులు, షాంపూలు తదితర ఉత్పత్తులు అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి యం.వి. ప్రసాద్ జి సి సి మేనేజర్ రమణారెడ్డి ఆయిల్ ఫెడ్ ఏరియా ఆఫీసర్ చింతా వెంకట శివయ్య ఏ ఎస్ ఓ చంద్రిక తదితరులు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …