రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 660 స్కూల్స్, 15 జూనియర్ కాలేజి ల పరిధిలో నాడు నేడు పనులను మన బడి కార్యక్రమములో భాగంగా చేపట్టడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కే. మాధవీలత పేర్కొన్నారు. గురువారం విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీర్. రాజశేఖర్ అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక కలెక్టర్ ఛాంబర్ నుంచి కలెక్టర్ మాధవీలత పాల్గొన్నారు . అనంతరం హౌసింగ్ ప్రగతి పై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలమాట్లాడుతూ జిల్లాలో మన బడి నాడు నేడు కింద రూ.264.56 కోట్ల తో చేపడుతున్న పనులను పూర్తి స్థాయి లో చేపట్టే దిశలో వాటి వివరాలు ఎప్పటికప్పుడు జరుగుతున్న పనులను అప్లోడ్ చేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా 660 స్కూల్స్ లో చేపట్టే పనుల్లో అదనపు తరగతి గదులునున్280 స్కూల్స్ లో, 539 స్కూల్స్ లో నాడు నేడు పనులు, 129 స్కూల్స్ లో ప్రహరీ గోడలు,. 445 స్కూల్స్ కి ఫర్నీచర్, 660 స్కూల్స్ కోసం గ్రీన్ బోర్డులను, 632 స్కూల్స్ కి ఫ్యాన్స్, 516 స్కూల్స్ లో పారిశుధ్య పనులు, 445 స్కూల్స్ కి టివి లు, 622 స్కూల్స్ లో త్రాగునీరు, 445 స్కూల్స్ లో రూఫ్ మరమ్మత్తులు, బాత్ రూమ్ టైల్స్ 445 స్కూల్స్ లో, జీ ఐ డోర్స్, కిటికీలు, విద్యుత్ పనులు 632 స్కూల్స్ లో చేపట్టి వాటికి సంబంధించి వివరాలు అప్లోడ్ చేశామని తెలిపారు. జిల్లాలలో 87 అంగన్వాడీ కేంద్రాల తరగతి పనులను కూడా చేపట్టడం జరిగిందని మాధవీలత అన్నారు. జిల్లాలో చేపట్టే నాడు నేడు పనులకు సంబంధించి 821 ఇండెంట్ ల ద్వారా 25856.77 మెట్రిక్ టన్నుల ఇసుక, 61 ఇండెంట్ ద్వారా 10674 టన్నుల సిమెంట్ కి డిమాండ్ పంపామని, వాటిలో 754 ఇసుక ఇండెంట్, 57 సిమెంట్ ఇండెంట్ మొత్తాలు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు.
హౌసింగ్ పై సమీక్ష…
జిల్లాలో బిబిఎల్ స్థాయి లో ఉన్న గృహాలు 27 వేలు, ఇంకా పనులు ప్రారంభం కానీ సుమారు 9 వేల గృహాల పనులు ప్రారంభించేలా హౌసింగ్ అధికారులు దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ మాధవీలత స్పష్టం చేశారు. 90 రోజుల కార్యక్రమం లి భాగంగా ఇటీవల మంజూరు చేసిన ఇళ్ళ స్థలాలు లోనూ, స్వంత స్థలం లో ఇళ్లు కట్టుకునే వాటికి సంబంధించిన పనులు పెండింగులో ఉన్నాయని అధికారులు వివరించారు. ప్రభుత్వం ఇళ్లు లేని పేదల స్వంత ఇంటి కల సాకారం చేసేందుకు నిబద్దత తో కూడిన పనితీరును చూపాలని పేర్కొన్నారు. లబ్ధిదారుల వివరాలు ఏ రోజుకు ఆరోజు అప్లోడ్ చేయడం ద్వారా పరిపాలన ఆమోదం పొంది వాటి నిర్మాణ పనులను మరింత వేగం చెయ్యాలని తెలిపారు. ఇంటి నిర్మాణం కోసం ఆసక్తి చూపని వాటి వివరాలు కూడా లబ్దిదారుల వారీగా డేటా అందచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశం లో జిల్లా విద్య అధికారి ఎస్. అబ్రహం, జిల్లా హౌసింగ్ అధికారి బి. తారచంద్, డివిజన్ అధికారులు సిహెచ్. బాబురావు, తదితరులు తదితరులు పాల్గొన్నారు.