విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థకు సంబంధించిన జోనల్ ఆఫీసులలో పట్టణ ప్రణాళిక సిబ్బంది వారు ది.28-10-2022 న ఫ్రై డే ఓపెన్ ఫోరం /LRS మేళను నిర్వహించినారు. సదరు మేళా నందు 12 మంది ప్రజలు పాల్గొని పట్టణ ప్రణాళిక శాఖకు సంబంధించి తమ సమస్యలను తెలియచేసి తమ అనుమానములను నివృత్తి చేసుకొనినారు. LRS కి సంబంధించిన పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయడమే ఈ మేళా యొక్క ముఖ్యోద్దేశ్యమనియు మరియు ప్రభుత్వము వారు LRSకి సంబంధించిన పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించే నిమిత్తము 31-10-2022 వరకు మెమో నెం.1426943/MM2/2021, తేది 10-08-2022 ప్రకారము పొడిగించబడినదనియు తెలియచేయటమైనది. కావున సదరు మూడు సర్కిల్స్ లో నిర్వహించిన మేళా నందు ఈ క్రింది అంశములకు గాను హాజరైన ప్రజల వివరములు తెలియజేయటమైనది. మూడు సర్కిల్స్ నందు పై ఓపెన్ ఫోరం /LRS మేళ నందు దాఖలు పరచిన మొత్తం 12 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించబడుననియు మరియు ప్రతి శుక్రవారం ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 వరకు మూడు సర్కిళ్ల నందు ఓపెన్ ఫోరం / LRS మేళాలు నిర్వహించబడునని అందరు లైసెన్సెడ్ సర్వేయర్ / లైసెన్సెడ్ టెక్నికల్ పర్సన్ /ఇంజనీర్ లకు మరియు ప్రజలకు తెలియచేయడమైనది. అంతే కాక సమస్యల పరిష్కరించు కొనుటకు గాను 3 సర్కిల్స్ నందు గల పట్టాణ ప్రణాళిక విభాగమునకు సంబంధించిన టి. పి. బి. ఒ / టి. పి. ఎస్ / టి. పి. ఒ లు మరియు అసిస్టెంట్ సిటి ప్లానర్లు, డిప్యూటీ సిటీ ప్లానర్ల ద్వారా నిర్వహించబడునని తెలియజేయడమైనది.
Tags vijayawada
Check Also
థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్
-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …