-నగరంలో జరిగినటువంటివి ఆధునికకరణ పనుల పరిశీలించిన కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న పలు గ్రీనరి ఆధునీకరణ పనులను నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, శుక్రవారం ఉదయం ఇంజనీరింగ్ విభాగం మరియు ఉద్యానవన విభాగం అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించినారు. అభివృద్ధి పనులల్లో నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉన్నాయో పూర్తిస్థాయిలో పరిశిలించి మాత్రమే గుత్తేదార్లకు బిల్లులు చెల్లిస్తామని కమిషనర్ తెలిపారు. కనకదుర్గ ఫ్లై ఓవర్, క్రింద డా.కె.ఎల్ రావు హెడ్ వాటర్ వర్క్స్ నుండి భవానిపురం, స్వాతి జంక్షన్ లోపల వరకు కాంట్రాక్టర్లకు వారు పూర్తి చేసినటువంటి గ్రీనరీ వర్క్స్ కి చెల్లించాల్సి బిల్లులకు సంబదించి కమిషనర్ గారు జరిగినటువంటి పనులను క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో కలసి పరిశీలించినారు. పర్యటనలో ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాసు మరియు ఇతర అధికారులు కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.