-మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ నందు వివిధ విభాగములలో విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో మరణించిన వారి యొక్క కుటుంబ సభ్యులలో ఒకరికి కారుణ్య నియామకం క్రింద ఉద్యోగ అవకాశం కల్పించుటలో భాగంగా నేడు నగర మేయర్ భాగ్యలక్ష్మి తన ఛాంబర్ నందు కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ తో కలసి 5 గురికి కారుణ్య నియామకపు ఉత్తర్వులను స్వయముగా అందజేశారు. ఈ సందర్భములో కమిషనర్ మాట్లాడుతూ మీ యొక్క విద్యార్హతలను బట్టి జూనియర్ అసిస్టెంట్, మెకానిక్, వాచ్ మాన్, పబ్లిక్ హెల్త్ వర్కర్ వంటి పోస్టింగ్ లను కేటాయిస్తూ వివిధ విభాగములలో పోస్టింగ్లు ఇచ్చుట జరిగిందని మీరందరూ విధి నిర్వహణలో బాధ్యతయుతముగా విధులు నిర్వహించాలని అన్నారు.