Breaking News

ముఖ్యమంత్రి తిరుపతి జిల్లా నియోజకవర్గ సమీక్ష వినతులపై సత్వరమే చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆగష్టు 3 న జరిగిన తిరుపతి జిల్లా నియోజకవర్గ ఎం.ఎల్.ఎ లు, ఎం.పి. తదితర ప్రజా ప్రతినిధుల ముఖ్యమంత్రి సమీక్షలో వారు తెలిపిన అంశాలపై మరియు వినతులపై చేపట్టిన చర్యలపై జిల్లా అధికారులతో కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి మరియు జాయింట్ కలెక్టర్ డి.కే. బాలాజీ సంయుక్తం గా సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫెరెన్స్ హాల్ లో సంక్షేమ, అభివృద్ధి మరియు ఇంజనీరింగ్ శాఖల అధికారులతో పై అంశాలపై చేపట్టిన చర్యలపై కలెక్టర్ సమీక్షిస్తూ ముఖ్యమంత్రి గారి సమీక్షలో వచ్చిన అంశాలు, వినతులపై అధికారులు సత్వరమే నివేదికలు తయారుచేసి సంబందిత రాష్ట్ర స్థాయి అధికారులకు పంపుతూ వాటి ప్రతిని మరియు పురోగతిని ముఖ్యమంత్రి కార్యదర్శి కార్యాలయముకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంజనీరింగ్ అధికారులు వారి శాఖకు సంబందించిన వాటిపై ఎస్టిమేట్లు సిద్ధం చేసి వారి శాఖల ఉన్నతాధికారులకు పంపాలని కోరారు. పుత్తూరు సి.హెచ్.సి. ఆసుపత్రి 30 బెడ్ ల నుండి 100 బెడ్ ల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చేయడం, వెంకటగిరి నందు స్కిల్ డెవలప్మెంట్ కళాశాలకు , వేంకటగిరి నందు డయాలసిస్ సౌకర్యం తో 100 బెడ్ ల ఆసుపత్రి, ట్రామా కేర్ యూనిట్, రోడ్ల ఏర్పాట్లు, మరమ్మత్తులు తదితరాలైన అన్ని నియోజకవర్గాల అన్ని రకాల ప్రతిపాదనలు వచ్చే సోమవారం నాటికి పూర్తి స్థాయిలో తయారు చేసి పంపేలా ఉండాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా రహదారి భవనాల అధికారి సుధాకర్ రెడ్డి, జిల్లా సంక్షేమ మరియు సాదికార సంస్థ అధికారి చెన్నయ్య, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి శ్యామ్ మోహన్, జిల్లా సర్వే అధికారి జయరాజ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *