Breaking News

తిరుమల తిరుపతి ఆల్ ఇండియా ఓపెన్ ఫైడ్ ర్యాపిడ్ రేటింగ్ చెస్ పోటీలు : డా.మురళి కృష్ణ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ర క్రీడా సాధికార సంస్థ విజయవాడ మరియు రాష్ర చెస్ అసోసియేషన్ విజయవాడ వారి సంయుక్త ఆద్వర్యములో తిరుమల తిరుపతి ఆల్ ఇండియా ఓపెన్ ఫైడ్ ర్యాపిడ్ రేటింగ్ జాతీయ స్థాయి పోటీలు ఈ నెల 29 మరియు 30 వ తేదిలలో శ్రీ శ్రీనివాస స్టోర్స్ కాంప్లెక్స్ తిరుపతి నందు జరగనున్నాయని సి.ఈ.ఓ. డా.మురళి కృష్ణ తెలిపారు. ఈ పోటీలకు ఇప్పటి వరకు 300 మంది క్రీడాకారులు నమోదు చేసుకున్నారని,100 మంది అంతర్జాతీయ రేటింగ్ కలిగిన క్రీడాకారులు పాల్గొననున్నారని, అంతేగాక 3 (ముగ్గురు) అంతర్జాతీయ మాష్టర్లు ఈ పోటీలలో పాల్గొననున్నారని మరియు శ్రీలంక దేశస్థుడు అనుభవజ్ఞుడు ఆటగాడు తమ పేర్లను ఇప్పటి వరకు నమోదు చేసుకున్నారని తెలియజేశారు. రాష్ట్ర క్రీడా సాధికారిక సంస్థ వారి వద్ద దేశ వ్యాప్తంగా 400 మంది క్రీడాకారులు నమోదు చేసుకుని ఈ పోటీలలో పాల్గొననున్నారని శ్రీ ధరేంద్ర కుమార్ బిహార్ అంతర్జాతీయ ఆర్బిటర్ చైర్మన్, ఆర్బిటర్ కమిషనర్ ఆఫ్ ఇండియా వారు చీఫ్ ట్రైనర్ గా మరియు ఎగ్జామినర్ గా వ్యవహరిస్తారని తద్వారా గ్రామ స్థాయిలో విద్యార్థులకు యువకులకు చెస్ ఆట పట్ల ఆసక్తి కలగడానికి దోహద పడుతుందని తెలియజేసారు. ఈ కార్యక్రమ సందర్భంలో జిల్లాలో చెస్ ఇన్ స్కూల్ ట్రైనర్ ప్రోగ్రాం లో పాల్గొన్న 33 మంది కి రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ విజయవాడ వారి ద్వారా సర్టిఫికెట్స్ అందజేయడం జరుగుతుందని సి.ఈ.ఓ డి.ఎస్.ఏ వారు ఒక ప్రకటనలో తెలిపారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *