Breaking News

ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన జి ఐ జెడ్ సీనియర్ అడ్వైజర్, వివిధ రాష్ట్రాల వ్యవసాయ శాఖ ప్రతినిధులు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా రామచంద్ర పురం మండలం కుప్పంబాదురు యూనిట్ పరిధిలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను రాష్ట్ర ప్రకృతి వ్యవసాయ రాయలసీమ రీజినల్ కో ఆర్డినేటర్ చంద్రశేఖర్, ఎస్ ఆర్ పి రామచంద్రయ్య , తిరుపతి జిల్లా డిపిఎం మునిరత్నం ఆధ్వర్యంలో జిఐజెడ్ సీనియర్ అడ్వైజర్ శ్రీమతి నమిత్రశర్మ , కర్ణాటక, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రతినిధులు కుప్పంబాదురు యూనిట్ పరిధిలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. ముందుగా కుప్పం బాదురు గ్రామంలోని రైతు భరోసా కేంద్రంలో మహిళ సంఘ సభ్యులతో ప్రకృతి వ్యవసాయంపై ముఖాముఖి చర్చించారు. ప్రకృతి వ్యవసాయంలో అతి ముఖ్యమైన విత్తన గుళికలు తయారీ విధానాన్ని, ప్రీమాన్ డ్రై సోయింగ్ (15 రకాల మిశ్రమ పంట విధానం) విధానం వలన కలిగే ప్రయోజనాల గురించి పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యవసాయ శాఖ ప్రతినిధులకు రాష్ట్ర సాంకేతిక నిపుణులు రామచంద్రయ్య పూర్తిస్థాయిలో తెలియపరిచారు. ఆంధ్రప్రదేశ్ రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ విధివిధానాలను తమ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక అందించి దేశం మొత్తం ప్రకృతి వ్యవసాయాన్ని విస్తరించేలా ముందుకు వెళతామని వివిధ రాష్ట్రాల వ్యవసాయ శాఖ ప్రతినిధులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్పి శ్రీకర్, జిల్లా సిబ్బంది మల్లికార్జున్, రాగమ్మ, సంఘమిత్ర మునీశ్వరి, మండల సిబ్బంది లాలమ్మ, మహేశ్వరి, ధనుంజయులు, సుబ్రహ్మణ్యం రెడ్డి, సురేష్, రామయ్య నీలా కుమార్, పద్మనాభం, కపిల్లీశ్వరయ్య, యశోద , నాగమణి, నాగరాజు మహిళలు, రైతులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *