విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ స్వాతంత్య్రానికి పోరాడిరది మహాత్మాగాంధీ అయితే తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ప్రాణాలు ఫణంగా పెట్టింది అమరజీవి పొట్టి శ్రీరాములు అని గాంధీóదేశం సోషల్ వెల్పేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు గాంధీ నాగరాజన్ అన్నారు. మంగళవారం పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఊర్మిళనగర్‌లోని తన ట్రస్టు కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయం సమీపంలో నూతనంగా ఆవిష్కరించిన పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేయాలని డిమాండ్‌తో తన ప్రాణాలు ఫణంగా పెట్టిన అమరజీవి పొట్టి శ్రీరాములుకి మన వారు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆవేదన వ్యక్తంచేశారు. అమరజీవి ఋణం ఎవ్వరూ తీర్చలేనిదని అందుకే ఆయన పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటుచేయాలని ఆయన కోరారు. భవిష్యత్‌లో ఆయనకు మించిన గౌరవం ఇంకెవ్వరికి దక్కనంత ప్రాధాన్యత సంతరించుకునేలా పొట్టి శ్రీరాములుకి ప్రత్యేక స్థానం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పొట్టి శ్రీరాములు ఏ ఒక్క కులానికే పరిమితం కాదని ఆంధ్రుల ఆరాధ్యదైవం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గాంధీదేశం ట్రస్ట్ సభ్యులు ఆర్.శివరంజని, బి.భారతి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …