Breaking News

నాడు నేడు పనులతో సంక్షేమ హాస్టళ్లకు గురుకుల పాఠశాలలకు మహర్దశ

-నాణ్యమైన మెను, ఇంగ్లీష్ మీడియంతో మెరుగైన విద్య: సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి
-ఏపీ స్టడీ సర్కిల్ ను సందర్శించిన మంత్రి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నాడు నేడు పనులతో సాంఘిక సంక్షేమ హాస్టళ్లకు గురుకుల పాఠశాలకు మహర్దశ వస్తోందని, నాణ్యమైన మెను, ఇంగ్లీష్ మీడియం విద్య తో విద్యా వ్యవస్థలో దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి సంస్కరణలు తెచ్చి అభివృద్ధి చేస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు.

శనివారం స్థానిక పద్మావతి అతిథి గృహం వద్ద మీడియాతో మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమం కింద రాష్ట్రంలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో, గురుకుల పాఠశాలల్లో టాయిలెట్ల వసతి కాంపౌండ్ వాల్సు ఏర్పాటు మరియు తదితర మరమ్మతులు చేపట్టి మౌలిక సదుపాయాలు కల్పించి వాటిని ఆహ్లాదకరమైన మంచి వాతావరణంలో విద్యార్థులు ఉండేలా చర్యలు చేపడుతున్నామని అన్నారు. తాను కూడా సంక్షేమ హాస్టళ్లలో ఉండి చదువుకున్నానని, అప్పుడు ఇంత మంచి వసతులు ఆహారం ఉండేవి కాదని, నేడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేల కోట్లతో సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాల లు వాటిలో నాణ్యమైన విద్య కొరకు బడ్జెట్ కేటాయించి ఖర్చు చేస్తున్నారని అన్నారు. అలాగే ప్రభుత్వ భవనాల్లో 50% పైగా నాడు-నేడు కింద అభివృద్ధి చేస్తున్నామని, నాణ్యమైన ఆహారం అందించే దిశగా మెను ఏర్పాటు చేసామని విద్యార్థులు ఆరోగ్యంగా ఉండే విధంగా డైట్ ఛార్జీలు పెంపుదలపై సమీక్షిస్తున్నామని, ఇంగ్లీష్ మీడియం విద్యతో బలహీన వర్గాలకు చెందిన పిల్లలు ఇంగ్లీషులో మాట్లాడగలిగే పోటీ ప్రపంచంలో నిలబడగలిగే విధంగా వినూత్నంగా, సర్వాంగ సుందరంగా హాస్టల్లను సంక్షేమ గురుకుల పాఠశాలలను తీర్చి దిద్దుతున్నామని అన్నారు. ఎస్సి ఎస్టి బిసి మైనారిటీ ప్రభుత్వ, ప్రైవేట్ హాస్టల్లను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే దిశగా సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి ఆధ్వర్యంలో కమిటీ వేసి తదుపరి చర్యలు తీసుకోబోతున్నమని అన్నారు. ఈ ప్రభుత్వం బడుగు బలహీనర్గాలకు అండగా నిలబడే ప్రభుత్వం అని ఈ సందర్భంగా కొనియాడారు.

అనంతరం చెన్నారెడ్డి కాలనీ లోని ఏపీ స్టడీ సర్కిల్ ను మంత్రి సందర్శించి అక్కడ విద్యార్థులతో వారి చదువు మరియు వసతి సౌకర్యాలకు సంబంధించిన విషయాలు తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా సాంఘిక సంక్షేమ సాధికార అధికారి చెన్నయ్య తదితరులు ఉన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *