– మాతృత్వ చిలడ్రన్స్ ఆసుపత్రిని సందర్శించిన మంత్రి పెద్దిరెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్రెడ్డి వందలాది జబ్బులను ఆరోగ్యశ్రీలో చేర్చి మెరుగైన వైద్యం అందిస్తున్నారని రాష్ట్ర అటవీ, విద్యుత్, భూగర్భగనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతి ఎంఆర్పల్లి సర్కిల్ వద్ద నూతనంగా ప్రారంభించిన మాతృత్వ చిలడ్రన్స్ స్పెషాలిటీ ఆసుపత్రిని శనివారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సందర్శించారు. చిన్నపిల్లలకు అందించే వైద్యసేవలను ఆ |ఆసుపత్రి డాక్టర్ ఎస్. మాదవిప్రసాద్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలోని పరికరాలను పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో మంత్రి పెద్దిరెడ్డి బీపీ చెక్ చేసుకున్నారు. చెన్నై తరహాలో తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో మల్టీ సూపర్స్పెషాలిటీ ఆసుపత్రులు ఎన్నో తీసుకొచ్చారని తెలిపారు. సామాన్య, మధ్యతరగతి వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆర్టీవో కనక నరసారెడ్డి, రేణిగుంట తహశీల్దార్ |శివప్రసాద్, డిప్యూటీ తహశీల్దార్లు ప్రేమ్ కుమార్, రూప్చంద్, పార్టీ సీనియర్ నాయకులు | విరుపాక్షి జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.