Breaking News

సి యం జగన్మోహన్ రెడ్డి స్పూర్తితో ముందుకు వెళ్తున్నాం: మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పీఎల్ఆర్ జాబ్ సెంటర్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందించిన రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం 109 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసారు. గ్రామీణ ప్రాంతాల పేద కుటుంబాలు ఆర్థికంగా, సామాజికంగా పుంజుకోవాలనే ముఖ్య ఉద్దేశం తో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో జాబ్ మేళాలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ  పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఏర్పాటు చేసారు. ఇప్పటి వరకు జాబ్ మేళాల ద్వారా మూడు జిల్లాల పరిధిలో 11897 మందికి ఉద్యోగాలు,ఒక్క పుంగనూరు నియోజకవర్గం లో మొత్తం 6127 మందికి ఉద్యోగాలు, ఆర్మీ కు 161 మంది ఎంపిక.  ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాటలాడుతూ పీఎల్ఆర్ జాబ్ మేళా ద్వారా అనేక మందికి ఉద్యగ అవకాశాలు చూపిస్తున్నారుమనవంతు బాధ్యత గా తీసుకుని, ఈ నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని భావించాంవారి కుటుంబాలకు ఆర్థికంగా వారు అండగా నిలవాలని మేము ఈ చర్యలు తీసుకున్నాం. దీనికి ప్రధాన కారణం సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  విధానాలేఏ రాష్ట్రంలో, ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా దాదాపు 2.27 లక్షల మంది కార్యదర్శులను గ్రామ సచివాలయంలో నియమించారువాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి మరో 2 లక్షల మందికి పైగా ఉపాధి కల్పించారుఇలా మొత్తంగా 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సిఎం  వైఎస్ జగన్ మోహన్ రెడ్డిదినిరంతరం ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి సిఎం వైఎస్ జగన్ బాటలో నడుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో  ఏపీఎస్ఆర్టీసి చైర్మన్  ఏ మల్లికార్జున రెడ్డి, జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎమ్మెల్సీ  కే.అర్.జే భరత్, గూడూరు ఎమ్మెల్యే  వరప్రసాద్, టిటిడి పాలకమండలి సభ్యులు  పోకల అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *