Breaking News

ఓర్పుతో వినండి. సమస్యను పరిష్కరించండి.. స్పందన లక్ష్యం నేరవేర్చండి…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో ఆర్జీలను స్వీకరించి ఆర్జీదార్ల నుండి సమస్యను పూర్తిగా విని అర్థం చేసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నప్పుడే స్పందన లక్ష్యం నేరవేరుతుందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
స్థానిక పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి అర్జీ దారులనుండి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి అర్జీదార్లు తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో స్పందనను ఆశ్రయిస్తారన్నారు. ఆర్జీదార్లల నుండి ఆర్జీని స్వీకరించి రశీదు ఇచ్చి పరిష్కరిస్తామని చెప్పడం సరికాదన్నారు. సంబంధిత అధికారులు ఆర్జీదారుడు ఇచ్చిన వినతిని క్షుణ్ణంగా పరిశీలించి సమస్య గుర్తించి ఆర్జీ దారుడు చెప్పె విషయాన్ని విని అర్థం చేసుకోవాలన్నారు. వినతిపై సంబంధిత అధికారులు సిబ్బందితో ముఖాముఖి మాట్లాడి సమస్యను పరిష్కరించిన్నప్పుడే స్పందన లక్ష్యం నేరవేరుతుందని, తద్వారా ప్రజలు స్పందన పై పెటుకున్న నమ్మకాన్ని మరింత పెంచిన వారమవుతామని అన్నారు. వ్యక్తిగత సమస్య మనకు ఎదురైనప్పుడు పరిష్కరించాల్సిన వారి నుండి సానుకూల దృక్పదాన్ని ఏవిధంగా ఆశిస్తామో అదే రీతిన ఆర్జీదారుడు ఆశిస్తారనే విషయాన్ని అర్థం చేసుకోగలిగితే సమస్యను పరిష్కరించడానికి మార్గాలు కనుగొలుకుతామన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన మంచి ఫలితాలను ఇస్తూన్నాయని దాదాపు 50 శాతం పైగా సమస్యలను అక్కడిక్కడే పరిష్కరించగలుగుతున్నామన్నారు. మిగిలిన ఆర్జీలు కొన్ని కోర్టుల పరిధిలోను, మరి కొన్ని రెవెన్యూ కోర్టుల పరిధిలోను ఉంటున్నాయని వాటిని ఏవిధంగా పరిష్కారించాలనే ఆలోచన చేయాలన్నారు. అదేవిధంగా సబ్‌ డివిజన్‌, రస్తాల ఈజ్‌మెట్‌ ఏవిధంగా చేయాలనే విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు. సమస్యలను పరిష్కరించడం ద్వారా ఆర్జీదారుల్లో సంతృప్తిని పెంచినప్పుడే స్పందన లక్ష్యాలను సాధించగలుగుతామన్నారు.
స్పందన పోర్టల్లో గడువులోగా పరిష్కరించాల్సిన వాటిని తక్షణమే పరిష్కరించాలని గడువు తీరిన అర్జీలు ఉండరాదన్నారు. 48 గంటలలో పరిష్కరించాల్సిన వాటిపై అధికారులు దృష్టి సారించాలన్నారు. గడువులోగా పరిష్కరించాల్సిన అర్జీలను గడువు దాటే వరకు ఉంచరాదన్నారు. మండల స్థాయిలో అధికారులు స్పందన ఆర్జీలపై పరిష్కారం చూపకపోవడంతో అధిక స్థాయిలో అర్జీలు పునరావృతం అవుతున్నాయని ఆయన వివరించారు. అధికారులు చిత్తశుద్దితో పనిచేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయని తద్వారా అర్జీదారులలో సంతృప్తి పెరుగుతుందని కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
స్పందనలో 79 వినతులు నమోదు కాగా వీటిలో అత్యధికంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 30, పోలీస్‌ 14, యంఎయుడి 9, విద్య 8, వైద్య 5, వ్యవసాయ 4, పంచాయతీరాజ్‌ 2, వివిధ శాఖలకు సంబంధించి 7 అర్జీలు నమోదయ్యాయన్నారు. తన పరిధిలోని వాటిని కలెక్టరు తక్షణమే పరిష్కరించగా కొన్నింటిని విచారించి పరిశీలించాలన్నారు.
కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, అసిస్టెంట్‌ డిప్యూటి కలెక్టర్లు ఎస్‌.రామలక్ష్మి, ఖతీఫ్‌ కౌసర్‌ బానో, డ్వామా పీడి జె సునీత, డీఈవో సీివీ రేణుక, ఐసీడీఎస్‌ పీిడి యం.ఉమాదేవి, గ్రామ, వార్డు సచివాలయ జిల్లా అధికారి కె. అనురాధ, డీఎస్‌వో పి.కోమలి పద్మ, హౌసింగ్‌ పీడి శ్రీదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

థ్యాంక్యూ డిప్యూటీ సీఎం సార్

-సమస్య చెప్పుకొన్న నాలుగు వారాల్లోపే పరిష్కారం -క్యాంపు కార్యాలయానికి వచ్చి ధన్యవాదాలు తెలిపిన మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఔట్ సోర్సింగ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *