రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కుష్ఠు వ్యాధి లక్షణాలు ఉన్న బాధితులను గుర్తించి వారికి తగిన వైద్య చికిత్స అందించడంతో ప్రజల్లో అవగాహన పెంచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నవంబర్ 15 నుంచి డిసెంబర్ 5 వరకు నిర్వహించే సర్వే కార్యక్రమం పోస్టర్ ను, అవగాహన కార్యక్రమాన్ని జెసి ప్రారంభించారు. అనంతరం క్షేత్ర స్థాయి లో విధులు నిర్వర్తించే ఆశా, వాలంటీర్లు ఎంతో నిబద్దత తో కూడి ఇంటింటి సర్వే ను సమర్థవంతంగా వివరాలు సేకరణ పూర్తి చేసి, నివేదికలు సమర్పించాలని స్పష్టం చేశారు. తగిన వైద్య పరీక్షలు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, లక్షణాలు మేరకు డాక్టర్లు ను సంప్రదించి చికిత్స, తగిన వైద్య సేవలు అందించే క్రమంలో సిబ్బంది సమన్వయం చేసుకోవాలని ఆయన అన్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని డి ఎమ్ అండ్ హెచ్ ఓ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో డి ఎమ్ హెచ్ ఓ కే. వేంకటేశ్వర రావు, వైద్యధి కారి డా ఎన్. వసుంధర తదితరులు పాల్గొన్నారు.
Tags rajamendri
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …