విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
“మధుమేహ నివారణా దినం” ను పురస్కరించుకొని వాసవ్య మహిళా మండలి అపోలో టైర్స్ హెల్త్ కేర్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఆటోనగర్ లోని రెండవ రోడ్డు నందు. వైధ్యశిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మెడికల్ అధికారి యం. వెంకటాద్రి మాట్లాడుతూ మధుమేహ సమస్య వయస్సుతో సంబందం లేకుండా అందరూ దీనిబారిన పడుతున్నారని కావున ప్రతి ఒక్కరూ దీనిపై అవగాహన ను కలిగిఉండాలని, కుటుంబంలోని ఎవరైనా వ్యక్తులకు మధుమేహం ఉన్నట్లైతే ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉండాలని, ఒకవేళ మధుమేహం ఉన్నట్లు గుర్తిస్తే క్రమం తప్పకుండా శారీరక శ్రమతో పాటు, ఆహార నియమాలు పాటించాలని, పొగాకు ఉత్పత్తులను తీసుకునే అలవాటు ఉంటే అత్యంత ప్రమాదమని ఆయన అన్నారు. కావున వాటికి దూరంగా ఉండడం చేయాలని లేని పక్షంలో కంటిచూపు, గుండె, కిడ్ని సమస్యలు ఎదురవుతాయని ఆయన అన్నారు. ఈ వైద్యశిభిరంలో కార్మికులకు మధుమేహంపై సిబ్బంది అవగాహనను ఇచ్చి వారికి మధుమేహ పరీక్షలను ఉచితంగా చేసి వారి ఫలితాలను తెలియజేసామని ఆయన అన్నారు. అంతేకాకుండా కంటి పరీక్షలు, రక్తపోటు, బ్లడ్ గ్రూప్ పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేసామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ యమ్. వెంకటాద్రి, ప్రాజెక్ట్ మేనేజర్ కె.శ్రీనివాసరావు, ఆప్తమాలజిస్ట్ జె. మణికంఠ, లాబ్ టెక్నిషియన్ టి. మహాలక్ష్మి, కౌన్సులర్ ఎ.జె.ఆర్.సత్యప్రసాద్, ఫార్మసిస్ట్ నాగరాజు, ఆరోగ్య కార్యకర్త డి. వీరాంజనేయులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …