Breaking News

పారిశుధ్య నిర్వహణ విధానం పరిశీలన…

-అధికారులకు ఆదేశాలు : కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, బుధవారం 25 వ డివిజన్ పరిధిలోని సీతారామపురం ప్రాంతములోని పలు వీధులలో పారిశుధ్యo మరియు అండర్ గ్రౌండ్ డ్రెయినేజి నిర్వహణ విధానమును పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలను జారీ చేసారు. డివిజన్ పరిధిలో పారిశుధ్య కార్మికుల మస్తరు విధానమును పరిశీలించారు. అన్నదాన సమాజం రోడ్డు పలు వీధులలో స్థానికులకు మంచినీటి సరఫరా విధానము, ప్రతి రోజు చెత్తను సేకరించుటకు మరియు డ్రెయిన్స్ శుభ్రపరచుటకు సిబ్బంది వస్తున్నది లేనిది అడిగితెలుసుకొని ఎవ్వరు కుడా చెత్తను విచ్చలవిడిగా వీధులందు మరియు డ్రెయిన్ లలో వేయకుండా చెత్త సేకరణకు వచ్చు పారిశుధ్య సిబ్బందికి మాత్రమే అందించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అదే విధంగా కొన్ని డివిజనులయందు ఇంటింటి చెత్త సేకరణ విధానము మరియు డ్రెయిన్ల యందు మురుగునీటి పారుదల తీరును పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇస్తూ, డ్రెయిన్ లలో నీటి పారుదలకు అడ్డంగా ఉన్న చెత్త మరియు వ్యర్ధములను తొలగించాలని నూరు శాతం డోర్ టు డోర్ బాస్కెట్ కలెక్షన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. పర్యటనలో పబ్లిక్ హెల్త్ సిబ్బంది మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *