తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 30 న మదనపల్లిలో విద్యా దీవెన కార్యక్రమానికి రానున్న నేపథ్యంలో రేణిగుంట విమనశ్రయంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి, జిల్లా ఎస్.పి పరమేశ్వర్ రెడ్డి పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 30 న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొనడానికి రేణిగుంట విమానాశ్రయానికి ఉదయం 10.20 గంటలకు చేరుకొని హెలికాప్టర్ లో మదనపల్లి వెళ్లనున్నారని కార్యక్రమ అనంతరం మద్యాహ్నం 1.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని తిరుగు ప్రయాణం కానున్నారని తెలిపారు. గౌ.ముఖ్యమంత్రి తాడేపల్లిలో మరో కార్యక్రమంలో పాల్గొననున్నారని మనం ఇక్కడ ఆలస్యం కలగకుండా చూడాలి అని సూచించారు. జిల్లా ఎస్.పి. భద్రతా ఏర్పాట్లపై విమానాశ్రయ, పోలీసు అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ. రామారావు, విమానాశ్రయ డిప్యూటీ కమాండెంట్ డి.సి.శుక్లా, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రాజశేఖర రెడ్డి, డి.ఎం. అండ్ హెచ్ ఓ శ్రీహరి, ఇంటలిజెన్స్ ఇన్స్పెక్టర్ సింహాద్రి నాయుడు, మెడికల్ ఆఫీసర్ ప్రకాష్, ఎం.టి.ఓ రెడ్డెప్ప రెడ్డి, జిల్లా ఫైర్ ఆఫీసర్ రమణయ్య, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ నర్మద, రేణిగుంట తహశీల్దార్ శివప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …