-కక్షిదారులకు కౌన్సిలింగ్ ను నిర్వహించిన న్యాయమూర్తి యు. రామ్మోహన్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరవీధులలో, జనావాసాలలోనికి వస్తున్న పందులపై చర్యలలో భాగంగా పందులపెంపకం దారులపై చార్జిషీట్లను మొబైల్ కోర్టులో దాఖలు చేయవలసిందిగా కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి మంగళవారం జరిగే మొబైల్ కోర్టులో భాగంగా కార్పొరేషన్ కోర్టు న్యాయమూర్తి యు. రామ్మోహన్ ఈ రోజు సర్కిల్-2 కార్యాలయంలో మొబైల్ కోర్టును నిర్వహించినారు. సర్కిల్-2 కు సంబందించిన శానిటరీ ఇన్స్పెక్టర్లు మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిపై 27 కేసులు నమోదు చేసి వారిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచినారు. వీటిలో ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహింస్తున్న వ్యక్తులను మరియు విచ్చలవిడిగా పశువులను రోడ్ల పైకి వదిలివేసే వ్యక్తులను మరియు రోడ్ల పైన చెత్త వేసే వారిని నేరాల క్రింద వారికి న్యాయమూర్తి రూ. 13 వేల 510 జరిమానాను విధించినారు. మరోసారి ఈ విధంగా నిబంధనలకు విరుద్ధంగా చేస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వారిని హెచ్చరించారు. అనంతరం న్యాయమూర్తి వారికి కౌన్సిలింగ్ ను నిర్వహించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణపై కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాలను అమలుచేయవలసిన భాద్యత మనందరిపై ఉందని అన్నారు. ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రెటరీలు, కూడా ప్రతిరోజు ఆయా డివిజన్లలో ప్లాస్టిక్ అమ్మే షాపులను తనిఖీ చేసి అందరు విధిగా ప్లాస్టిక్ బ్యాన్ అమలుచేయవలసినదిగా అదేశిoచినారు.
కార్యక్రమంలో జోనల్ కమిషనర్-2, హెల్త్ ఆఫీసర్లు, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, శానిటరీ సెక్రెటరీలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.