తోటపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
దివ్యాoగ విద్యార్థినీ విద్యార్థులకు సహాయక సాంకేతిక పరికరాలు ఉపయోగించి అభ్యసన ఫలితాలు వారిలో ఎలా పెంపొందించాలి అనే అంశం మీద ప్రత్యేక ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం తేదీ 5 డిసెంబర్ న హీల్ స్కూల్ , తోటపల్లి లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎస్. సురేష్ కుమార్, పాఠశాల విద్యా కమీషనర్, మరియు రాష్ట్ర పథక సంచాలకులు, సమగ్ర శిక్షా, ఆంధ్రప్రదేశ్, బి. శ్రీనివాసరావు, రాష్ట్ర అదనపు ప్రాజెక్ట్ సంచాలకులు, సమగ్ర శిక్షా, ఆంధ్రప్రదేశ్ పాల్గొన్నారు.
పాఠశాల విద్యా కమీషనర్, మాట్లాడుతూ, దివ్యాoగలు విద్యాభివృద్ధికి సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా పాఠశాలల్లో మరియు భవిత కేంద్రాల్లో పనిచేస్తున్న ప్రత్యేక ఉపాధ్యాయులకు మరియు రిసోర్స్ పర్సన్స్ కు సహాయక సాంకేతిక పరికరాలు ఉపయోగించి దివ్యాoగ విద్యార్థినీ విద్యార్థులలో అభ్యసన సామర్ధ్యాలు పెంపొందించి వారి యొక్క అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రంలో పని చేస్తున్న అందరూ ప్రత్యేక ఉపాధ్యాయులు మరియు భవిత కేంద్రాలలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్ అందరికీ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రత్యేక ఉపాధ్యాయులు అందరూ బాధ్యతతో పనిచేసి విద్యార్థుల ఉన్నతికి పాటుపడాలని కోరారు.
రాష్ట్ర అదనపు పథక సంచాలకులు, సమగ్ర శిక్షా, మాట్లాడుతూ,దివ్యాoగ విద్యార్థుల కు సేవ చేయాలని ఒక తలంపుతో ఈ వృత్తిలోకి వచ్చిన అందరు ప్రత్యేక ఉపాధ్యాయులందరినీ అభినందించారు. అదేవిధంగా ఈ ఐదు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డా. కె.వి.శ్రీనివాసులు రెడ్డి, అదనపు రాష్ట్ర పథక సంచాలకులు, ఎన్. కె.అన్నపూర్ణ, రాష్ట్ర సహిత విద్యా కోఆర్డినేటర్, సమగ్ర శిక్షా, శ్రీనివాసులు రెడ్డి, నోడల్ ఆఫీసర్, ఆర్.బి.యస్.కె, రిసోర్స్ పర్సన్స్ రామ్ కమల్ మరియు ఇతర రిసోర్స్ పర్సన్స్ , హీల్ స్కూల్ వ్యవస్థాపకులు డా. కోనేరు సత్యప్రసాద్, అజయ్ కుమార్, సి. ఈ. ఓ. మరియు 26 జిల్లాల నుండి వచ్చిన 130 ప్రత్యేక ఉపాధ్యాయులు పాల్గొన్నారు.