Breaking News

ఇంధన పరిరక్షణ వారోత్సవాలను విజయవంతం చేయండి

-అన్ని ప్రభుత్వ శాఖలకు ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విజ్ఞప్తి
-రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి 20 వరకు ఇంధన శాఖ వారోత్సవాలు
-భవిష్యత్ తరాలకు కూడా శాశ్వత ప్రాతిపదికన 24x 7 విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఢోకా లేకుండా చేయాలని ముఖ్యమంత్రి ఆకాంక్ష
-రాష్ట్ర విద్యుత్ రంగాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలి — ఇంధన శాఖ మంత్రి
-స్వల్పకాలిక , దీర్ఘకాలిక ఇంధన భద్రత అందించడంలో ఇంధన సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తుంది
-వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏర్పాటు చేసిన ఇంధన సంరక్షణ విభాగాలు ఈ వారోత్సవాల్లో చురుకుగా పాల్గొనాలి
-విద్యార్థులు, స్వయం సహాయ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చర్యలు తీసుకోవాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ రంగం పటిష్టత , ఇంధన భద్రత సాధించడం , ఆర్థికాభివృద్ధి లక్ష్యల సాధనలో భాగంగా రాష్ట్రంలో ఇంధన సామర్ధ్య రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ నెల 14 నుండి 20 వరకు జరిగే జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాలలో ప్రభుత్వ శాఖలను భాగస్వాములు చేయనుంది . రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఈ మేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు విజ్ఞప్తి చేసారు.
ఇంధన శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశమలో ఇంధన శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రములోని విద్యుత్ రంగాన్ని పటిష్టం చేసి భవిష్యత్ తరాలకు కూడా శాశ్వత ప్రాతిపదికన 24X7 విద్యుత్ సరఫరాకు ఎటువంటి ఢోకా లేకుండా చేయాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కృత నిశ్చయంతో ఉన్నారని మంత్రి చెప్పారు . అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరాను మెరుగు పరచడం ద్వారా రాష్ట్ర విద్యుత్ రంగాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని మంత్రి తెలిపారు.ఇందుకోసం థర్మల్ తో పాటు, పునరుత్పాదక ఇంధన సామర్ధ్యాన్ని పెంచడమే గాక , ఇంధన సామర్థ్యం , ఇందన పొదుపు కార్యక్రమాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహించడం పై ప్రత్యేకంగా దృష్టి సారించిందన్నారు .
రాష్ట్రానికి స్వల్పకాలిక , దీర్ఘకాలిక ఇంధన భద్రత అందించడంలో ఇంధన సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. కీలక రంగాల్లో ఇంధన సామర్ధ్యాన్ని పటిష్టంగా అమలు చేయడం వల్ల విద్యుత్ , ఇతర ఇంధన వనరుల డిమాండ్ తగ్గుతుందన్నారు . తద్వారా బొగ్గు , ఆయిల్ , గ్యాస్ దిగుమతుల అవసరాన్ని కూడా కొంత మేర తగ్గించవచ్చని అన్నారు. దీని ద్వారా ఇంధన రంగం పటిష్టం అవ్వటమేగాక రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహద పడుతుందన్నారు రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరుగుతున్న తరుణంలో తక్షణమే ఇంధన సామర్ధ్యాన్ని అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు . దీని వల్ల బహిరంగ మార్కెట్ లో అదనపు విద్యుత్ కొనుగోళ్ల అవసరాన్ని కొంత మేర తగ్గించడంతో పాటు ఇంధన రంగం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పై పడే భారాన్ని కొంత మేర నియంత్రించవచ్చన్నారు .
అలాగే అదనంగా విద్యుత్ ఉత్పత్తి అవసరాన్ని కొంత తగ్గించడంతో పాటు విద్యుత్ ప్రసార పంపిణి పై చేసే వ్యయం కూడా తగ్గే అవకాశం ఉందన్నారు. దీనివల్ల విద్యుత్, ఇతర ఇంధన రంగ సంస్థలకు కూడా ఆర్థికంగా ప్రయాజనం కలుగుతుందన్నారు. అదే సమయంలో ఇంధన సామర్థ్యం, ఇంధన పరిరక్షణ కార్యక్రమాలతో వినియోగదారులకు ప్రయోజనం కలుగుతుందని, పర్యావరణం కూడా మెరుగవుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్ల లో రూ 4925 కోట్లు ప్రజాధనాన్ని ఆదా చేయడం, ఇంధన సామర్ధ్య కార్యక్రమాల ద్వారా 5600 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేసిన అంశాలను ఇంధన పరిరక్షణ వారోత్సవాలలో ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని ఏపీఎస్ఈసిఎం కు మంత్రి సూచించారు.అలాగే ఇంధన పొదుపు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో అన్ని ప్రభుత్వ శాఖలను భాగస్వాములను చేయాలన్నారు.
వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏర్పాటు చేసిన ఇంధన సంరక్షణ విభాగాలు ( ఎనర్జీ కన్సర్వేషన్ సెల్స్ ) ఈ వారోత్సవాల్లో చురుకుగా పాల్గొనాలని విజ్ఞప్తి చేసారు. అలాగే విద్యార్థులు, స్వయం సహాయ మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు. ప్రదానంగా విద్యుత్ సంస్థలు ఇంధన సామర్ధ్య కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. విద్యుత్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల్లో వీటి పై అవగాహన కల్పించాలని తద్వారా సాధారణ ప్రజల్లోకి ఇంధన పరిరక్షణ కార్యక్రమాలు తీసుకువెళ్లడం సులభతరం అవుతుందన్నారు .
అన్ని స్థాయిల్లోని ప్రభుత్వ శాఖ అధికారులు తమ తమ డిపార్ట్మెంట్లలో ఇంధన పొదుపు , ఇంధన సామర్ధ్య సంస్కృతి , జీవన శైలిని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు. ఆయా శాఖల్లో ఇంధన సామర్థ్యం, ఇంధన పరిరక్షణ అమలు చేయడం ద్వారా విద్యుత్ వినియోగం తగ్గి తద్వారా ఆర్థికంగా కూడా ప్రయోజనం పొందుతాయని పేర్కొన్నారు.
ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడుతూ ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను మంత్రికి వివరించారు. దీనిలో పరిశ్రమలు, స్వచ్చంద సంస్థలు , రైతులు , మహిళలను భాగస్వాములు చేస్తామని తెలిపారు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా, ఎపిఎస్ఇసిఎం ఎనర్జీ కన్జర్వేషన్ ర్యాలీ, ఎనర్జీ ఎఫిషియెన్సీ టెక్నాలజీలపై వర్క్షాప్, ఇ-వెహికల్స్, ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఇసిబిసి), పాట్ వంటి వాటి పై వర్క్షాప్ నిర్వహించనున్నారు .

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *