Breaking News

మాండూస్ తూఫాన్ సహాయక చర్యలు పారిశుధ్య పనులు మరింత వేగవంతం చేయండి: కలెక్టర్

-ఆస్తుల,పంట నష్టానికి చెందిన అంచనాలు పకడ్బందీగా చేపట్టండి సిద్ధం చేయాలి: మంత్రి పెద్ది రెడ్డి
-పారిశుద్ధ్య పునరావాస చర్యలు కొనసాగుతున్నాయి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మండోస్ తుఫాను నేపథ్యంలో గౌ. రాష్ట్ర అటవీ విద్యుత్తు భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతి చిత్తూరు అన్నమయ్య జిల్లాల కలెక్టర్ల తో తుఫాన్ కారణంగా భారీ వర్షాలతో జిల్లాలో వాటిల్లిన పంట ఆస్తి నష్ట వివరాలను బాధితుల పునరావాస చర్యలపై, పంట నష్ట ఆస్తి నష్ట అంచనాలపై తీసుకుంటున్న చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్షించగా స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ కె వెంకట రమణారెడ్డి సంబంధిత అధికారులతో హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి మాట్లాడుతూ తుఫాన్ ప్రభావం పై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ సమీక్షిస్తున్నారని, షెల్టర్స్ లో ఉన్న వారికి, ఇల్లులు దెబ్బతిన్న వారికి సత్వరం సహాయం అందించే చర్యలు చేపట్టాలని, ఇంతవరకు అధికారులు పూర్తి అప్రమత్తత తో పని చేశారని పంట నష్ట ఆస్తి నష్ట పరిహారం కోసం అంచనాలు పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్లకు పలు సూచనలు సలహాలు ఇచ్చి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మంత్రికి వివరిస్తూ రాష్ట్రంలోనే తిరుపతి జిల్లాలో అత్యధిక వర్ష పాతం పదవ తేదీ ఉదయం వరకు నమోదైందని మొత్తం 34 మండలాలలో దాదాపు 200 ఎం.ఎం కంటే ఎక్కువగా 10 మండలాల్లో, 150 ఎం.ఎం కంటే మించి 20 మండలాల్లో వర్షపాతం నమోదైందని తెలిపారు. నేటి ఉదయం నుంచి కొచెం తగ్గు ముఖం కనపడుతోందని, శ్రీకాళహస్తి, సూళ్ళూరు పేట , గూడూరు మూడు డివిజన్లకు చెందిన మండలాలలో అత్యధిక వర్షపాతం నమోదయిందని, కొన్ని చోట్ల కాజ్వేలు పొంగి ప్రవహిస్తున్నాయని అక్కడ రెవెన్యు, పోలిస్ యంత్రాంగాన్ని సిద్దంగా ఉంచి అక్కడ ఎవ్వరూ కూడా వాహన దారులను రానియ్యకుండా చూస్తున్నామని అలాంటి వాటికి రహదారికి సంబంధించి అంచనాలు వరద నీటి ప్రవాహం తగ్గినాక అంచనాలు పంపుతామని అన్నారు ఎటువంటి మానవ ప్రాణ నష్టం ఇప్పటివరకు జరగలేదని, పెద్ద జంతువులు ఎద్దులు ఆవులు 7, గొర్రెలు మేకలు 7 చనిపోవడం జరిగిందని అన్నారు. ఆస్తి నష్టానికి సంబందించి పూర్తి వివరాలు ఇంకా తెలియలేదని, రెవెన్యు యంత్రాంగం, సంబంధిత శాఖలు వీటిపై సర్వే మొదలు పెట్టారని రేపటి నుండి పూర్తిగా అంచనాల నివేదికలు తయారు చేయనున్నారని తెలిపారు. ఇప్పటి వరకు నాలుగు ప్రదేశాల్లో బాలాయపల్లి, రేణిగుంట, తడ, తిరుపతి లలో రిలీఫ్ క్యాంప్స్ పెట్టడం జరిగిందని ఇప్పటివరకు 571 మందిని సురక్షితంగా రిలీఫ్ కేంద్రాలకు తరలించి వారికి ఆహరం నీరు సరఫరా చేయడం జరుగుతోందని తెలిపారు. బాలాయపల్లి రేణిగుంట రిలీఫ్ కేంద్రాల నుండి ప్రజలు వారి నివాసాలకు వర్షం పరిస్థితి తగ్గాక వెళ్లడంతో మూసి వేశామని అన్నారు. తిరుపతి కాలనీలో సుమారు 50 ఇళ్ళలోకి నీరు చేరడంతో వారికి తమిళ స్కూల్ లో ఒక రిలీఫ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 70 మంది వరకు తరలింఛి వారికి కావలసిన అవసరాలను చూస్తున్నామన్నారు. తిరుపతి నగరంలో గతంలో వచ్చిన వరదల అనుభవంతో నగరంలో అన్ని చోట్ల ఎక్కడ నీటి ప్రవాహం ఉంటుందో అక్కడ నీటిని నిలబడకుండా ఫ్లో అయ్యేలా డ్రైనేజీ వ్యవస్థ పై ఎప్పటికప్పుడు మునిసిపల్ అధికారులతో చర్యలు చేపట్టామని అన్నారు. ఎటువంటి రోగాలు ప్రబలకుండా సానిటేషన్ చేయవలసినదిగా మునిసిపల్ అధికారులను, డి.పి.ఓ కు ఆదేశాలు ఇవ్వడం జరిగి౦దని వాటి చర్యలు క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్నాయని అన్నారు. డి.ఎం.హెచ్.ఓ ను మరియు ఆరోగ్య శాఖాధికారులను అత్యవసర సమయాల్లో అందుబాటులో ఉండవలసినదిగా ఆదేశించామని మెడికల్ క్యాం ఏర్పాటు చేశామని, వర్షాలకు ముందుగా అన్ని నీటి ట్యాంకులు నీటితో నింపి క్లోరినేషన్ చేశామని, రక్షిత త్రాగు నీరు అందిస్తున్నామని అన్నారు. అగ్రికల్చర్, సిరికల్చర్, హార్టికల్చర్ లో నష్టపోయిన రైతులు వాటిపై రిపోర్ట్ ను సిద్దం చేసి ప్రభుత్వానికి పంపడం జరుగుతుందన్నారు. ఇవి కాకుండా ఇటివలే విత్తనాలు నాటిన వాళ్ళు నష్టపోకుండా వారికి మళ్ళీ విత్తనాలు అందించే విధంగా ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు తమకు వచ్చాయని 80 శాతం సబ్సీడితో విత్తనాలను అందిస్తామని తెలిపారు, ప్రధానంగా అరనియర్, కాళంగి ,మల్లెమడుగు, కల్యాణి డ్యాం వీటిని కూడా ప్రతిక్షణం మానిటర్ చేయడం జరుగుతోందని తెలిపారు. వాగులు వంకలు చెరువులు నీటితో నీటితో నిండి ఉన్నాయని ఏదైనా వర్ష పాతం వచ్చినా వరద నీరు ఆగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
విద్యుత్తు శాఖ కు సంబంధించి 33 కేవీ, 11 కేవీ మరియు పోల్ డామేజి అయిన వాటిని పునరుద్ధరించడం జరిగిందనీ అన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు రిలీఫ్ సెంటర్లకు ఆశ్రయించిన వారికి ఇంటికి వెళ్లేప్పుడు వెయ్యి రూపాయలు అందచేస్తున్నమని అన్నారు. TR29 కింద నిబంధనల మేరకు రిలీఫ్ చర్యలు చేపట్టామని అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం అధికారులకు పై ఆదేశాలు మళ్ళీ స్పష్టంగా వివరించి పకడ్బందీగా రిలీఫ్, పంట నష్ట ఆస్తి నష్ట పరిహారం కొరకు ప్రతిపాదనలు పంపాలని, గతంలో వచ్చిన వరదలకు చెందిన పెండింగ్ తాత్కాలిక, పర్మనెంట్ రిపైర్ల బడ్జెట్ అంచనాలు మరియు ప్రస్తుత తూఫాన్ కు చెందిన నివేదికలు తయారు చేసి సమర్పించాలని ఆదేశించారు.

ప్రజలెవ్వరు భయ బ్రా౦తులకు గురి కావాల్సిన అవసరం లేదని ఏదైనా సమస్య ఉంటె కంట్రోల్ రూమ్ కి కాల్ చేసి తెలపాలని అన్నారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ శ్రీనివాసరావు ఆర్డీవో కనక నరసారెడ్డి ఆర్ అండ్ బి జిల్లా అధికారి సుధాకర్ రెడ్డి ఎలక్ట్రిసిటీ ఏపీ ఎస్పీడీసీఎల్ సిఎండి సంతోష్ రావు ఎస్ ఈ కృష్ణారెడ్డి జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి శంకర్ నారాయణ డిఎంహెచ్ఓ శ్రీహరి తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *