గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగర ప్రజల చిరకాల వాంచ అతి త్వరలో తీరనున్నదని,అందుకు తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం నగరం నడిబోడ్డులో బహుళ అంతస్తుల మోడల్ కూరగాయల మార్కెట్ కాంప్లెక్స్ భవన నిర్మాణానికి అనుమతివ్వడం ఎంతో గర్వకారణమని,దేశంలో గుంటూరు నగరాన్ని అభివృద్దిలో ఆదర్శ నగరంగా తీర్చిదిద్దుతామని యం.యల్.సి లేళ్ళ అప్పిరెడ్డి తెలిపారు. గురువారం మేయర్ ఛాంబర్ లో మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు, కమీషనర్ కీర్తి చేకూరి, యం.యల్.ఏ లు మహమ్మద్ ముస్తఫా, మద్దాలి గిరిధర్ల తో కలిసి పి.వి.కే నాయుడు మార్కెట్, మోడరన్ కబేళాకు ప్రభుత్వం నుండి వచ్చిన పరిపాలన ఆమోద జి.ఓ ల పై విలేఖరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు నగరాన్ని కుల మత రాజకీయాలకతీతంగా మోడల్ నగరంగా తీర్చి దిద్దుతామని తెలిపారు. పి.వి.కే నాయుడు మార్కెట్, అధునాతన కబేళాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయడంలో ప్రజాప్రతినిధులు అధికారులు సమిష్టి కృషి చేశారన్నారు. గుంటూరు నగరంలో త్రాగు నీటి అవసరాలు తీర్చేలా సమగ్ర త్రాగు నీటి పధకాన్ని వై.యస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో మంజూరు చేస్తే, ఆరోగ్య నగరంగా మార్చడంలో 16 వై.యస్.ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలను నేటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంజూరు చేశారన్నారు. గత ముఖ్యమంత్రి గుంటూరు జిల్లాలో నివాసం ఉన్నప్పటికీ గుంటూరు నగరాభివ్రుద్ది విస్మరించి యు.జి.డి పేరుతో కేంద్ర నిధులను దోచుకున్నారని విమర్శించారు.
మేయర్ మాట్లాడుతూ, గుంటూరు నగరానికే తలమానికంగా పి.వి.కే నాయుడు మార్కెట్ నిర్మిస్తామని, నగరంలో ఇప్పటికే 231 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. 1.92 ఎకరాల్లో 163 కోట్లతో 5.40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 8 అంతస్తులతో పి.వి.కే నాయుడు మార్కెట్ నిర్మాణం కు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిందని, అలాగే 11.89 కోట్లతో అధునాతన కబేళా నిర్మాణంకు అనుమతులు మంజూరు చేయడం హర్షనీయమన్నారు. గత ప్రభుత్వం నగర అభివృద్ధిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిందని, కనీసం 11 ఏళ్ల పాటు ఎన్నికలు కూడా నిర్వహించ లేదన్నారు. 10 ఏళ్ల క్రితం విలీనమైన గ్రామాలకు త్రాగునీరు కూడా అందించడానికి చర్యలు తీసుకోలేదని, వై.సి.పి.పాలకవర్గం అధికారంలోకి వచ్చాకే గోరంట్ల కొండ మీద రిజర్వాయర్ పనులు వేగం పుంజుకున్నాయన్నారు. 3 కోట్ల తో గాంధీ పార్క్ అభివృద్ధి పనులు చురుకుగా సాగుతున్నాయని, మానస సరోవరం పార్క్ అభివృద్ధి పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని తెలియచేశారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధి పదంలో నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
కమీషనర్ మాట్లాడుతూ, జి.ఓ.యం.యస్ నెంబర్ 186 ద్వారా పి.వి.కే నాయుడు మార్కెట్, జి.ఓ.ఆర్.టి నెంబర్ 935 ద్వారా మోడరన్ కబేళాలకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసిందని తెలిపారు. అడవితక్కేల్లపాడులోని టిడ్కో గృహ సముదాయంలో యస్.టి.పి పనులు చివరి దశలో ఉన్నాయని, గోరంట్ల కొండమీద నుండి త్రాగు నీటి సరఫరా పనులు 10 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. నగరంలో నగరానికి మంజూరైన 16 వై.యస్.ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రాలలో 12 ప్రారంభోత్సవాలు పూర్తయ్యాయని, మిగిలిన 4 నెల రోజుల్లో ప్రారంభోత్సవార్నికి సిద్దమౌతాయన్నారు. గడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ప్రతిపాదించిన వివిధ పనులు 20 అంచనా వ్యయంతో చేపట్టి వివిధ దశలలో ఉన్నాయన్నారు. యు,జి.డి పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని, అందుకు సంబంధించిన ఫైల్ కు ప్రభుత్వం నుండి పరిపాలన అనుమతులు రాగానే ప్రారంభిస్తామని తెలిపారు.
యం.యల్.ఏ ముస్తఫా మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో గుంటూరును రాజధానిగా ప్రకటించినప్పటికీ యు.జి.డి పేరుతో గుంతలూరుగా మార్చి, కేంద్ర ప్రభుత్వ నిధులను పంచుకున్నారని విమర్శించారు. ప్రస్తుత పాలక వర్గం సమిష్టిగా నగరాభివృద్ది పై ద్రుష్టి సారించిందని, ముఖ్యమంత్రి కూడా నగరాభివుద్ది పై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్న్నారు. నగరంలో రోడ్ల విస్తరణ పార్క్ ల అభివృద్ధి ఆరోగ్య కెంద్రాల ఏర్పాటు వంటి ప్రజా ఉపయోగ పనులు విస్తృతంగా జరుగుతున్నాయని తెలిపారు.
యం.యల్.ఏ మద్దాలి గిరిధర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో ఎప్పుడూ లేని విధంగా 3 ఏళ్ళు నుండి పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. పి.వి.కే నాయుడు మార్కెట్ గుంటూరు నగరానికి గ్రాండ్ సిటీ లుక్ తేవటంతో పాటు ఐ కాన్ నిలుస్తుందన్నారు. గతంలో యు.జి.డి పేరుతో త్రవ్విన రోడ్లను ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రస్తుత పాలక వర్గం మరమ్మతులు చేస్తున్నామని, గుంటూరు నగర 150 ఏళ్ళు పూర్తి చేసుకున్నప్పుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్ళినప్పుడు పట్టించుకోలేదన్నారు. గుంటూరు నగరాభివ్రుద్దికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న చేయుతకు నగర ప్రజల తరుపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.
సదరు సమావేశంలో డిప్యూటీ మేయర్లు వనమా బాల వజ్ర బాబు, షేక్ సజీల, నగర పాలక సంస్థ యస్.ఈ భాస్కర్, ఈ.ఈ సుందర రామి రెడ్డి పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …