-హౌసింగ్ లే-అవుట్ లలో నిర్మాణాలు వేగవంతం చేయాలి : సి.ఎస్. జవహర్ రెడ్డి
-పాఠశాలల్లో విద్యార్థుల డ్రాపౌట్ శాతం తగ్గించాలి
-బడి బయటి పిల్లలందరినీ బడిలో చేర్చేలా చర్యలు చేపట్టాలి
-వారంలోపు కాన్పు జరగబోయే మహిళల రక్షిత కాన్పుపై చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన వినతులు సకాలంలో పరిష్కరించాలని, హౌసింగ్ లే-అవుట్ లలో నిర్మాణాలు మరింత వేగవంతం చేయాలని, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అమలులో అనీమియా, ప్రసూతి మరణాలు లేకుండా చూడాలని సి.ఎస్. జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లను జాయింట్ కలెక్టర్ లను ఆదేశించారు. గురువారం ఉదయం అమరావతి నుండి పంచాయితీ రాజ్ కమీషనర్ కోనా శశిధర్, సిద్ధార్థ జైన్, సంబందిత కమీషనర్లు, కార్యదర్శులతో కలసి అన్నిజిల్లాల కలెక్టర్లతో, జాయింట్ కలెక్టర్ లతో వర్చువల్ విధానంలో పలు అంశాలపై సమీక్ష నిర్వహించగా కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణ రెడ్డి, జే సి డి.కే బాలాజీ తో కలిసి సంబంధిత అధికారులతో హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ స్పందన ఆర్జీలను సకాలంలో పరిష్కరించాలని బియాండ్ ఎస్.ఎల్.ఎ కి వెళ్ళకుండా అర్థవంతంగా పరిష్కారం చూపించి సంబందిత అర్జీదారునితో క్షేత్ర స్థాయి ఫోటో యాప్ లో అప్ లోడ్ చేయవలసినదిగా తెలిపారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళ పథకంలో భాగంగా జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణాలను స్టేజ్ వారీగా కన్వర్షన్ లో పురోగతి ఉండేలా వేగవంతం చేయాలని తెలిపారు. హౌసింగ్ లే-అవుట్ లలో అన్ని మౌలిక వసతులు, విద్యుత్, ఇంటింటికీ త్రాగునీరు వసతి కల్పించి నిర్దేశించిన గడువు లోపల పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. PMAY గ్రామీణ్ మీద దృష్టి పెట్టాలని జియో ట్యాగింగ్, మంజూరు, రిజిస్ట్రేషన్ వేగవంతం చేయాలని ఈ నెల 21 వ తేదీలోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని అన్నారు. ఆప్షన్- 3 ఇళ్లకు ఎస్.హెచ్.జి. ల ద్వారా లోన్లు అందించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్ లు, సంబందిత అధికారులు ప్రతి శనివారం హౌసింగ్ డే గా అన్ని మండలాలలో ఈ కార్యక్రమాన్ని అమలు చేసి హౌసింగ్ లో పురోగతి తీసుకురావాలని కోరారు.
అంతేకాకుండా క్లాప్ మిత్ర గౌరవ వేతన బకాయిలు ఎప్పటికప్పుడు చెల్లించాలని, బిల్లులు ఎప్పటికప్పుడు యాప్ లో అప్ లోడ్ చేయాలని అన్నారు. చెత్త నుండి సంపద కేంద్రాల నిర్మాణాలు ఇంకా ప్రారంభం కానివి ఉంటె వాటిని ప్రారంభించి నిర్మాణాలు వేగవంతం చేయాలని అన్నారు. ఇంటింటి నుండి చెత్త సేకరించి సంపద కేంద్రాలకు రవాణా చేయడం, వాటి ట్రీట్ మెంట్ మరియు డిస్పోసల్ అంతటినీ సరైన రీతిలో అమలు అయ్యేలా పర్యవేక్షించాలని వాటి వివరాలను జే.ఎస్.ఎస్. యాప్ నందు అప్ లోడ్ చేయాలని సూచించారు. జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష లో భాగంగా రీ సర్వే వేగవంతం చేయాలని ఫిబ్రవరి 2023 నాటికి 2 వేల గ్రామాలు పూర్తి స్థాయిలో గ్రౌండ్ ట్రూథింగ్, 9(2) నోటీసులు, 13 నోటిఫికేషన్ జరిగేలా చర్యలు చేపట్టాలని సిద్ధార్థ జైన్ తెలిపిన నేపథ్యంలో తగు చర్యల చేపట్టాలని ఆదేశించారు.
గౌ. ముఖ్యమంత్రి సలహాదారు సమీర్ శర్మ సూచించిన మేరకు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా వాలంటీర్ లు, ఆశా వర్కర్లు, ఏ.ఎన్.ఎం లు ప్రత్యేక శ్రద్ద వహించి నిర్దేశిత 8 ఇండికేటర్ లు, 4 పారా మీటర్ల వారిగా రక్త హీనత పోషకాహార లోపం లేకుండా ప్రత్యెక చర్యలు తీసుకోవాలని తెలిపారు. గర్భిణులకు, బాలింతలకు, కౌమార దశ అమ్మాయిలకు అనీమియా తగ్గించుట, పౌష్టికాహారం, జగనన్న గోరు ముద్ద, ఐరన్ మాత్రలు అందేలా వైద్య మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ, డి.ఈ.ఓ, సంక్షేమ శాఖల అధికారులు చర్యలు తీసుకొని పురోగతి చూపించాలని ఆదేశించారు. పాటశాలలో విద్యార్థుల నమోదు మరియు డ్రాపౌట్ సంఖ్య సమీక్షించుకొని బడి మానేసిన పిల్లలను బడిలో చేర్పించే దిశగా విద్యాశాఖ అధికారులు, సచివాలయ ఎడ్యుకేషన్ ఎమినిటి సెక్రటరీలు, వాలంటీర్లు పర్యవేక్షించి కన్సిస్టెంట్ రిథం యాప్ లో నమోదు చేసి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా సి.ఎస్ గారు సూచించిన మేరకు హాస్పిటల్ డెలివరీ లను ప్రోత్సహించి మాతా శిశు మరణాలు తగ్గించే దిశలో జిల్లాలో ముఖ్యంగా వారంలోపు కాన్పు అయ్యే మహిళల జాబితా సిద్ధం చేసుకొని వారికి మాతా శిశు మరణాలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని, అనీమియా పరీక్షలు జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించెలా చర్యలు తీసుకోవాలని, సమతుల్యమైన ఆహారం పై పిల్లలు, తల్లులు విద్యార్థులకు అవగాహన కల్పించి అనీమియా బారిన పడకుండా తల్లులు, పిల్లలను కాపాడాల్సిన బాద్యత ఉందని ఈ అంశంపై వచ్చేవారం సమీక్ష ఉంటుందని సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సూచికలపై దృష్టి పెట్టి పురోగతి సాధించాలని అన్నారు.
ఈ సమావేశంలో డి.ఆర్.ఓ. శ్రీనివాస రావు, ఏ డి సర్వే జయరాజ్, జిల్లా ప్లానింగ్ మరియు స్టాటిస్టికల్ అధికారి అశోక్ కుమార్, డి ఎల్ డి ఓ సుశీల దేవి, జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖా అధికారిణి జయలక్ష్మి, హౌసింగ్ పిడీ శ్రీనివాస ప్రసాద్, డి ఎం హెచ్ ఓ శ్రీహరి, డి.పి.ఓ. రాజశేఖర్ రెడ్డి, ఎస్.ఈ. ఆర్.డబ్ల్యు.ఎస్. విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.