రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలలో భాగంగా ది. 17.12.2022 వ తేదీన పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు విద్యుత్ పొదుపు-ప్రాముఖ్యత మీద వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు జరిగినవని శ టి.వి.ఎస్.ఎన్. మూర్తి – పర్యవేక్షక ఇంజినీరు, ఆపరేషన్ సర్కిల్, రాజమహేంద్రవరం వారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీల్లో విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విద్యుత్ పొదుపు పై తమ ఆలోచన విధానాన్ని వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు ద్వారా తెలియపరిచారు. ఈ వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీల ద్వారా చిన్నారుల యొక్క సృజనాత్మకతను, ప్రతిభను మరియు విద్యుత్ పొదుపు పై అవగాహనను పెంపొందిస్తున్నాయి. విద్యార్థులకు విద్యుత్ పొదుపు పై ఉన్న అవగాహనను విద్యుత్ అధికారులు అభినందించారు.
రాజమహేంద్రవరం, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఆపరేషన్, టౌన్-2 వారి ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ గెస్ట్ హౌస్, రాజమహేంద్రవరం నందు వ్యాసరచన పోటీలు జరిపారు. ట్రిప్స్ స్కూల్, అక్షర శ్రీ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, మునిసిపల్ హై స్కూల్, గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్, ఇన్నీసుపేట, డిఫెన్ స్కూల్, బి.వి.యం పాఠశాలల నుంచి 124 మంది విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారు.
అమలాపురం, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఆపరేషన్, వారి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్, అమలాపురం నందు వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు జరిగినవి. జిల్లా పరిషత్ గర్ల్స్ హై స్కూల్ నుంచి 45 మంది విద్యార్థులు పోటీలలో పాల్గొన్నారు.
కాకినాడ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఆపరేషన్, టౌన్-1 వారి ఆధ్వర్యములో మునిసిపల్ స్కూల్, రామకృష్ణ రావు పేట నందు వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు జరిగినవి. మునిసిపల్ పాఠశాల నుంచి 50 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీలలో పాల్గొన్నారు.
కాకినాడ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఆపరేషన్, టౌన్-2 వారి ఆధ్వర్యములో బి.ఆర్.యమ్.సి గర్ల్స్ హై స్కూల్ చర్చి స్క్వేర్, జగన్నాధపురం నందు వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు జరిగినవి.
బి.ఆర్.యమ్.సి గర్ల్స్ హై స్కూల్ పాఠశాల నుంచి 49 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీలలో పాల్గొన్నారు.
కాకినాడ రూరల్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఆపరేషన్ వారి ఆధ్వర్యములో జిల్లా పరిషత్ హై స్కూల్, కరప నందు వక్తృత్వ పోటీలు జరిగినవి. పాఠశాల నుంచి 48 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీలలో పాల్గొన్నారు.
జగ్గంపేట, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఆపరేషన్ వారి ఆధ్వర్యములో బాలయోగి గురుకులం స్కూల్, జగ్గంపేట నందు వ్యాసరచన పోటీలు జరిగినవి. పాఠశాల నుంచి 35 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీలలో పాల్గొన్నారు.
తుని, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఆపరేషన్ వారి ఆధ్వర్యములో గురుకులం గవర్నమెంట్ స్కూల్, యల్.కొత్తూరు నందు వ్యాసరచన పోటీలు జరిగినవి. పాఠశాల నుంచి 32 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీలలో పాల్గొన్నారు.
ప్రత్తిపాడు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఆపరేషన్ వారి ఆధ్వర్యములో గర్ల్స్ హై స్కూల్, ఏలేశ్వరం నందు వక్తృత్వ పోటీలు జరిగినవి. పాఠశాల నుంచి 25 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీలలో పాల్గొన్నారు.
రామచంద్రపురం, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఆపరేషన్ వారి ఆధ్వర్యములో రామకృష్ణ హై స్కూల్ అంగర గ్రామం నందు వ్యాసరచన పోటీలు జరిగినవి. పాఠశాల నుంచి 102 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీలలో పాల్గొన్నారు.
అనపర్తి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఆపరేషన్ వారి ఆధ్వర్యములో జిల్లా పరిషత్ హై స్కూల్ మరియు యమ్.పి.పి. ప్రైమరీ స్కూల్, రాయవరం నందు వ్యాసరచన పోటీలు జరిగినవి. పాఠశాలల నుంచి 85 మంది విద్యార్థులు వ్యాసరచన పోటీలలో పాల్గొన్నారు.
ఈ వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థిని విద్యార్థులకు ఉత్సావాలు ముగింపు రోజున అనగా ది.20.12.2022 తేదీన బహుమతులు అందచేయటం జరుగుతుందని టి.వి.ఎస్.ఎన్. మూర్తి, పర్యవేక్షక ఇంజినీరు, ఆపరేషన్ సర్కిల్, రాజమహేంద్రవరం వారు తెలిపారు.