Breaking News

హౌసింగ్ లే ఔట్లలో మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలి

-రోజు వారి స్టేజి కన్వర్షన్ లో పురోగతి ఉండాలి: జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న హౌసింగ్ లే ఔట్ లోని గృహాలకు మౌలిక వసతుల కల్పన సత్వరమే పూర్తి చేయాలని, స్టేజి కన్వర్షన్ లో పురోగతి ఉండాలని మూడవ కేటగిరి లబ్దిదారులకు అవగాహన కల్పించి పూర్తిచేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి శనివారం హౌసింగ్ డే గా నిర్ణయించిన నేపథ్యంలో నేటి శనివారం ఉదయం వడమాలపేట మండలం కాయం లే అవుట్ లో నిర్మితమవుతున్న గృహాలను జిల్లా కలెక్టర్ ఆకశ్మిక తనిఖీ నిర్వహించి పలు సూచనలు చేసారు.

ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ లే ఔట్ లో మిద్దె, గోడ స్థాయి పూర్తి స్థాయిలో ఇళ్ళు అయిన వాటికి విద్యుత్ మీటర్లు ఎ.పి.ఎస్.పి.డి.సి.ఎల్. ఎ.ఈ నిబందనల మేరకు సత్వరమే ఏర్పాటు చేయాలని ఆదేశించగా, విద్యుత్ పోల్ లు అన్ని తీగలతో అనుసంధానం చేసి పూర్తి స్థాయిలో ఉన్నాయని త్వరితగతిన మీటర్లు ఏర్పాటు చేస్తామని ఎ.ఈ. తెలిపారు. ఆర్.డబ్ల్యు.ఎస్. అధికారులు ఇంటింటికీ త్రాగు నీటి కుళాయిల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హౌసింగ్ ఎ.ఈ. వెంకటరత్నం కాయం లే ఔట్ లో 798 గృహాలకు గాను 152 బి.బి.ఎల్, 347 పునాది స్థాయి, 58 గోడల స్థాయి, స్లాబ్ స్థాయి 135, 102 గృహాలు పూర్తి అయ్యాయని తెలుపగా పునాది స్థాయి కన్నా దిగువన, పునాది స్థాయిలో ఉన్న లబ్దిదారులకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సచివాలయ వాలంటీర్లు అవగాహన కల్పించి స్టేజి కన్వర్షన్ ఉండేలా రోజువారి పురోగతి చూపించాలని ఆదేశించారు. ఎం.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్. క్రింద బిల్లులు లబ్దిదారుల ఖాతాలలో జమ అయిందని పథక సంచాలకులు డ్వామా లబ్దిదారులకు తెలిపారు. ఎప్పటికప్పుడు బిల్లులు ఆన్లైన్లో అప్ లోడ్ చేయాలని ఇంజనీరింగ్ అసిస్టెంట్ లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. లే ఔట్ కు రోడ్డు మరియు ఆర్చ్ ను త్వరగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పి.డి. ఇంచార్జ్ శ్రీనివాస ప్రసాద్, ఈ.ఈ. హౌసింగ్ చంద్రశేఖర్ బాబు, సంబందిత సచివాలయ సిబ్బంది, లబ్దిదారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *