రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ పొదుపు వారోత్సవాలలో భాగంగా కరపత్రాల పంపిణీ జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాలలో భాగంగా ది. 18.12.2022 వ తేదీన విద్యుత్ పొదుపు సూచనల కరపత్రాలను ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వినియోగదారులకు అంద జేయుట మరియు విద్యుత్ పొదుపు కు సంబంధించిన హోర్డింగులు ఏర్పాటు చేయుట జరిగినవని టి.వి.ఎస్.ఎన్. మూర్తి పర్యవేక్షక ఇంజినీరు, ఆపరేషన్ సర్కిల్, రాజమహేంద్రవరం వారు తెలిపారు.
ఘనంగా జరిగిన విద్యుత్ డివిజనల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు వేడుకలు-2022
ఏపిఈపిడిసిఎల్ 8వ ఇంటర్ డివిజనల్ స్పోర్ట్స్ మీట్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం జి ఎం సి బాలయోగి స్టేడియంలో జరిగాయి, దీనిలో భాగంగా చెస్, క్రీకెట్, వాలీబాల్, బాస్కెట్బాల్, కబడ్డీ,షటీల్,క్యారంస్ వంటి క్రీడా పోటీలను నిర్వహించారు, ఈ పోటీల్లో ఉద్యోగిని ఉద్యోగులు పాల్గొన్నారు, దీనిలో డివిజనల్ స్థాయిలో అమలాపురం ప్రధమ స్థానంలో నిలవగా, రంపచోడవరం ద్వితీయ స్థానంలోనూ, రాజమహేంద్రవరం తృతీయ స్థానంలో నిలిచాయి, ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ టి ఎస్ ఎన్ మూర్తి మాట్లాడుతూ ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ అనేవి పని వత్తిడి నుండి మనో వికాసం తో పాటు ఆరోగ్యం కలుగుతుంది అని అన్నారు, మొదటి సారిగా నూతన డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అయిన అమలాపురంలో నిర్వహించడం చాలా ఆనందదాయకమని , ఈ స్పోర్ట్స్ మీట్ అనేది రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా చాలా సంవత్సరాల మరలా ప్రారంభించడం జరిగింది అని అన్నారు, ఈ క్రీడా పోటీలను తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సంతోష్ కుమార్ ప్రారంభించడం జరిగింది అని అన్నారు, అదేవిధంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లో ఉన్న డివిజనల్ క్రీడాకారులు పాల్గొన్నారు అని అన్నారు.అనంతరం క్రీడా పోటీల్లో విజేతలకు ఎస్ ఇ – టి ఎస్ ఎన్ మూర్తి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు . ఈ కార్యక్రమంలో అమలాపురం డివిజనల్ ఇంజనీర్ ఎం రవికుమార్, స్పోర్ట్స్ సెక్రటరీ బి వాసు, పి ఈ టీ లు గణేష్, మరియు విద్యుత్ ఏడిఈ లు,ఎఇ లు, జూనియర్ మరియు సీనియర్ అసిస్టెంట్ లు పాల్గొన్నారు.