రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఇప్పటి వరకు 1,81,054.920 మెట్రిక్ టన్నుల (ఎమ్ టి) ధాన్యం సేకరణ చేపట్టి రైతుల ఖాతాలకు రూ.153.55 కోట్ల మేర చెల్లింపులు చెయ్యడం జరిగిందనీ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఖరీఫ్ సీజన్లో నియోజక వర్గాల వారీగా చెల్లింపుల వివరాలు
జిల్లాలో ఇప్పటివరకు 32659 మంది రైతుల నుంచి 45028 రశీదు ల (FTOs) ద్వారా రూ.369.36 కోట్ల విలువ చేసే ధాన్యం కొనుగోలు చేసి రూ.153.55 కోట్ల మేర నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమచేసమన్నారు.
నియోజక వర్గాల వారీగా
. అనపర్తి నియోజకవర్గ పరిధిలో మొత్తం 44455.520 మెట్రిక్ టన్నుల ధాన్యం రూ.90.69 కోట్ల మేర కొనుగోలు చేసి రైతు ల ఖాతాలకు రూ. 44.28 కోట్లు మేర జమ చేసాము.
గోపాలపురం నియోజక వర్గంలో 21227.160 మెట్రిక్ టన్నుల ధాన్యం రూ. 43.3 కోట్ల మేర కొనుగోలు చేసి రూ.13.05 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేశామన్నారు.
కొవ్వూరు నియోజక వర్గంలో మొత్తం 36464.640 మెట్రిక్ టన్నుల ధాన్యం రూ.74.39 కోట్ల మేర కొనుగోలు చేసి రూ.36.80 కోట్లు రైతుల ఖాతాకు జమ చేసాము.
నిడదవోలు నియోజక వర్గం లో 49113.680 మెట్రిక్ టన్నుల ధాన్యం రూ.100.20 కోట్లు మేర కొనుగోలు చేసి రూ. 36.14 కోట్లు జమ చేసాము.
రాజమహేంద్రవరం రూరల్ నియోజక వర్గం మొత్తం 9608.320 మెట్రిక్ టన్నుల ధాన్యం రూ. 19.60 కోట్ల మేర కొనుగోలు చేసి రూ.9.03 కోట్లు చెల్లింపులు జరిపాము.
రాజానగరం నియోజక వర్గం కి చెందిన మ 20185.600 మెట్రిక్ టన్నుల ధాన్యం రూ.41.18 కోట్ల కు కొనుగోలు చేసి రూ. 14.25 కోట్ల మేర చెల్లింపులు జరిపాము.