Breaking News

విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం !!

-కృష్ణాజిల్లాలో 12,759 ట్యాబ్ లు పంపిణీ… : జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా

కౌతవరం, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యా వ్యవస్థ లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టి విద్యార్థినీ విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేందుకు ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని కృష్ణా జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు.
బుధవారం మధ్యాహ్నం కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో శ్రీ కానూరి దామోదరయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక, జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ లు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని తెలియ చెప్పడానికి ఈ కార్యక్రమం ఒక గొప్ప ఉదాహరణ అని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి తన జన్మదినోత్సవాన్ని విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణం కోసం జరుపుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. తాము చదువుకునే రోజుల్లో పాఠ్యపుస్తకాలే సరిగ్గా అందుబాటులో లేక ఎంతో ఇబ్బందులు పడేవారమన్నారు. నేడు పేద విద్యార్థులకు సైతం డిజిటల్ విధానంలో విద్యను అందుబాటులోకి తెస్తూ, తరగతి గదుల్లో చెప్పే పాఠాలను ఇళ్లకు వెళ్లాక కూడా పిల్లలు మరింత క్షుణ్ణంగా, సులభంగా నేర్చుకునేందుకు వీలుగా బైజూస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్లు ఉచితంగా పంపిణీ చేయడం రాష్ట్ర చరిత్రలోనే ఎంతో విప్లవాత్మకమైన పరిణామం అన్నారు. స్కూళ్ళలో ఇంటర్నెట్ సౌకర్యం.. ఇంటి వద్ద ఇంటర్నెట్ “సౌకర్యం లేని విద్యార్థులకు ఆఫ్ లైన్ లో కూడా ఎక్కడైనా, ఎప్పుడైనా పాఠ్యాంశాలు అందుబాటులో ఉండేలా 8, 9 తరగతుల కంటెంట్ మెమొరీ కార్డు ద్వారా ట్యాబ్ లలో సంక్షిప్తపరిచే విధానం అద్భుతమని అన్నారు.
జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో మన విద్యార్థులు తమ సత్తా చాటుకుని అవకాశం మరింత మెరుగవుతుందన్నారు. సీబీఎస్ఈ సిలబస్ ఆధారంగా బైజూస్ యాప్ లో పాఠ్యాంశాల రూపకల్పన జరిగిందన్నారు.
బైజూస్ ప్రీమియం యాప్ ద్వారా విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్. బయాలజీ, కెమిస్ట్రీ, హిస్టరీ, జియాలజీ, సివిక్స్ సబ్జెక్ట్ లలో అభ్యసన సులువుగా ఉండేలా ఉచిత ఈ కంటెంట్.. ప్రతి చాప్టర్ ను కాన్సెప్ట్ లుగా విభజించి 57 చాప్టర్లలోని 472 కాన్సెప్ట్ పై 300 వీడియోలు, 168 సాల్వ్ డ్ క్వశ్చన్ బ్యాంక్ లు అందుబాటులో ఉంచడం ద్వారా విద్యార్థినీ విద్యార్థులకు అరటిపండు వలచి చేతిలో పెట్టినట్లు అవుతుందన్నారు.
అందరికి సమానమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు యూనిఫారం, నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, తదితరమైనవి ప్రభుత్వం అందిస్తున్నట్లు వివరించారు. రానున్న రోజుల్లో విద్యార్థులంతా బాగా చదువుకొని అభివృద్ధి చెందాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ట్యాబ్ లను ఉపయోగించుకొని ఇంటర్మీడియట్ కు వచ్చేసరికి కంప్యూటర్లు, ట్యాబ్ లపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉంటారని, ఎలాంటి పోటీ పరీక్షల్లోనైనా పొల్గొని విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ట్యాబ్ ల్లో బై జూస్ కంటెంట్ ఉంటుందని, విద్యార్థులు ట్యాబ్ లు దుర్వినియోగం చేసుకోకుండా కంటెంట్ ను మాత్రమే వాడాలని, నిబద్ధతతో ఉండాలని ఆయన హితవు పలికారు. ముందుగా టీచర్లకు ట్యాబ్ లు పంపిణీ చేస్తే వారు అవగాహన చేసుకొని, విద్యార్థులకు చెప్పడానికి అవకాశం ఉంటుందన్నారు.
ఈ విద్యా విధానంలో సులభంగా పాఠ్యాంశాలు అర్థమయ్యేలా రూపకల్పన చేయడమే కాకుండా మంచి చిత్రాలు. వీడియో, ఆడియో, త్రీ డైమన్షన్ (త్రీడీ) ఫార్ములా. యానిమేషన్లతో రూపొందించిన కంటెంట్ నిక్షిప్తం చేశారన్నారు.
విద్యార్థిని విద్యార్థులకు అందించిన ట్యాబ్ లలో అవాంఛనీయ సైట్లు, యాప్స ను ‘నిరోధించే ప్రత్యేక సాఫ్ట్ వేర్ సైతం ఉందన్నారు. ప్రతి ట్యా బ్ కు 3 ఏళ్ల పాటు సంపూర్ణ వారంటీ ఇవ్వడమే కాకుండా, ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సమీపంలోని సచివాలయాల్లో అందజేస్తే వాటిని ఒక వారం రోజుల వ్యవధిలో వాటిని రిపేర్ చేసైనా ఇస్తారని లేదా మార్చి వేరే ట్యాబ్ ఇస్తారని కలెక్టర్ తెలిపారు.
ఈ ఏడాది జూన్ కల్లా “నాడు నేడు” పేజ్ 1లో పూర్తయిన పాఠశాలల లోని 6వ తరగతి పైన తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ (డిజిటల్ డిస్ప్లే బోర్డుల ద్వారా చదువులు) ప్రారంభం కానున్నట్లు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్ళలో స్మార్ట్ టీవీల ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం శుభ పరిణామం అని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా వివరించారు.
అనంతరం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారికా రాము మాట్లాడుతూ, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను అందించడం దేశ చరిత్రలోనే తొలిసారి అని, విద్యకు ఎంతో విలువిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేశానికి ఆదర్శ సీఎం అని కీర్తించారు. పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ప్రధానంగా కావలసిన విద్యా, మౌళిక సదుపాయాలని, నేడు నేడు పథకం ద్వారా కార్పొరేట్ విద్యను అందించే దిశగా పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఒకొక్క విద్యార్థికి రూ.15 వేల రూపాయలు విలువగల టాబ్స్ పంపిణీ చేయడం జరుగుతుందని, మరో 15 వేల రూపాయల విలువైన పాఠ్యాంశ కంటెంట్ అందులో పొందిపరిచి ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి ఈ ట్యాబ్ లు వినియోగించుకొని, తమ తమ భవిష్యత్తు మెరుగుపరిచేకొనే విధంగా రూపొందలన్నారు.విద్యార్థులకు నూతన విద్యా విధానంపై అవగాహన ఉపాధ్యాయులకు శిక్షణ సైతం ప్రభుత్వం ఇస్తున్నట్లు వివరించారు.
తర్వాత జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ మాట్లాడుతూ, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్ పంపిణీ చేయడం ఒక గొప్ప కార్యక్రమని చెప్పారు. విద్యార్థులంతా బాగా చదువుకొని ఉన్నత చదువులు చదువుకొని అభివృద్ధి చెందాలని కోరారు. ట్యాబ్ లలో ప్రశ్నలు జవాబులు ఉంటాయన్నారు. అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఎనిమిదవ తరగతుల నుండి ట్యాబ్ లు పంపిణీ చేస్తారని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు.
జిల్లా విద్యా శాఖాధికారిణి తాహెరున్నీసా సుల్తానా మాట్లాడుతూ, నాడు నేడు లో శిధిలమైన పాఠశాల భవనాలను తిరిగి కొత్త భవనాలుగా ప్రభుత్వం నిర్మిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులంతా ట్యాబ్ లను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. విద్యార్థుల గుర్తింపు నంబర్ తో ట్యాబ్ లు ఓపెన్ చేయవచ్చని, ట్యాబ్ ల్లో బై జూస్ కంటెంట్ ఉంటుందని చెప్పారు. విద్యార్థులంతా బాగా చదువుకోవచ్చని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో చదువుకోడానికి చాలా ఇబ్బందులు ఉండేదని, నాడు-నేడు ద్వారా చేపట్టిన పనులతో విద్యార్థులకు చదువుకోవాలనే ఆశ, ఉద్దేశం కలుగుతుందన్నారు.
అనంతరం పదిమంది విద్యార్థిని విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ చేశారు.
తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి వందేమాతరం గీతాలపనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో గుడివాడ ఆర్డిఓ పద్మావతి సమగ్ర శిక్ష అధికారి శ్రీకాంత్, ఎంపీడీవో దారపు శ్రీనివాసరావు, తాహిసిల్దార్ రెహమాన్, మండల విద్యాశాఖ అధికారి కే టి వి సుబ్రమణ్యం, కౌతవరం జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు బీవిఎన్ఎల్ పద్మావతి, ఎంపీపీ కొడాలి సురేష్, ఎంపీటీసీ దుర్గ, చినగొన్నూరు సర్పంచ్ కోటప్రోలు నాగు, బాడిగ భాస్కరరావు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *