-పోలింగ్ కేంద్రాల ఓటరు నమోదు జనాభా లెక్కల నిష్పత్తి ప్రకారం సరి చూసుకోవాలి
-జిల్లాలో జరుగుతున్న పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు డా. పోలా భాస్కర్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్)- 2023 కింద ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులను నాణ్యత తో కూడి డిసెంబరు 24 కి పూర్తి చేయాలని జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు రాష్ట్ర కళాశాల విద్య కమిషనర్ డా. పి.భాస్కర్ అన్నారు. పెండింగు లో ఉన్న 1799 దరఖాస్తులను పోలింగ్ కేంద్రాల వారీగా ప్రణాళిక సిద్ధం చేసుకుని పరిష్కారం చూపాలన్నారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తో జిల్లాకు సంబంధించి ఎస్ఎస్ఆర్-2023 కార్యకలాపాలపై ఈఆర్‌వో, ఏఈఆర్‌వోలతో జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డా. పి.భాస్కర్ మాట్లాడుతూ ప్రత్యేక సంక్షిప్త సవరణలో భాగంగా కొత్తగా ఓటరుగా నమోదు, తొలగింపు, ఓటరు వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే సవరించడం, బదిలీ తదితరాలకు సంబంధించి పారదర్శకంగా విధులను నిర్వహించాల్సి ఉంటుందన్నారు.
జిల్లాలో 36723 క్లెయిమ్‌లు, అబ్జెక్షన్లు వచ్చాయని, వీటిలో ఇప్పటికే 34924 దరఖాస్తుల పరిష్కారం జరిగిందని తెలిపారు. మిగిలిన ధరకాస్తు ల పరిష్కారం కోసం ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నరు.
నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ఆయా నియోజకవర్గాల ఈఆర్‌వోల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 2023, జనవరి 5న తుది జాబితాను ప్రచురించనున్న నేపథ్యంలో ఈ నెల 24 నాటికి దరఖాస్తుల పరిష్కారాన్ని పూర్తిచేయాలని సూచించారు. జిల్లాలో జరుగుతున్న ప్రక్రియ పట్ల అధికారులకు తగిన సూచనలు చేశారు .
తూర్పుగోదావరి జిల్లాలో దోష రహిత ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియ చాలా బాగా జరుగుతోందని ఇందుకు జిల్లా కలెక్టర్ నేతృత్వంలో కృషిచేస్తున్న ఈఆర్‌వో, ఏఈఆర్‌వో, బి ఎల్ ఓ లను అభినందించారు. దరఖాస్తుల పరిష్కారంలో క్షేత్రస్థాయిలో బీఎల్‌వోలు చేసే భౌతిక పరిశీలన చాలా ముఖ్యమైందని.. ఈ పరిశీలనలు నాణ్యంగా జరిగేలా ఈఆర్‌వో, ఏఈఆర్‌వోలు వ్యక్తిగత బాధ్యత తో ఉండాలని సూచించారు. నాణ్యత తో కూడి తనిఖీలు నిర్వహించాలని, నిష్పక్షపాతంగా, పారదర్శకతతో, జవాబుదారీతనంతో దరఖాస్తుల పరిష్కారం జరగాలని పి. భాస్కర్ స్పష్టం చేశారు. ఈ విషయంలో భవిష్యత్తులో ఎటువంటి ఫిర్యాదుల
కు ఆస్కారం లేకుండా చూసుకోవాలని పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ డా. మాధవీలత మాట్లాడుతూ ఎస్ఎస్ఆర్-2023లో భాగంగా నవంబర్ , డిసెంబర్ నెలల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. డిసెంబర్ 8 వరకు ఫారం-6, ఫారం 7, ఫారం -8 దరఖాస్తులను మొత్తం 36,723 స్వీకరించినట్లు ఆమె వెల్లడించారు. ఇందులో 18-19 వయస్సు వారి దరఖాస్తులను కాలేజీల్లో స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేసి స్వీకరించడం జరిగిందని వెల్లడించారు. వీటితో పాటు మొత్తం దరఖాస్తులను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా డాక్యు మెంట్లు సరిచూసుకుని ఇప్పటి వరకు 34,924 దరఖాస్తులు పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. వాటిలో ఫారం 6 దరకస్తులు 23,941 రాగ, 22681 పరిష్కారం చేశామని, ఇంకా 1261 పెండింగులో ఉన్నాయన్నారు. ఫారం- 7 అప్లికేషన్స్ 7404 రాగా 7084 పరిష్కారం చేశామనీ ఇంకా 320 ఉన్నట్లు, అదే విధంగా ఫారం-8 కి సంబంధించి 5378 దరఖాస్తులు రాగా ఇప్పటి వరకూ 5160 పరిష్కారం చేశామని, ఇంకా 218 పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. మిగిలిన వాటిని ఈనెల 23 కి పూర్తి చేసే క్రమంలో దోష రహిత ఓటర్ల జాబితా రూపకల్పనకు అధికారులు , బూత్ లెవల్ అధికారులతో సమన్వయంతో పనిచేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
సమావేశంలో డి ఆర్ వో జి. నరసింహులు, రాజమహేంద్రవరం, కొవ్వూరు ఆర్‌డీవోలు , ఏ.చైత్ర వర్షిని, ఎస్ మల్లిబాబు, నియోజక వర్గాల ఓటరు నమోదు అధికారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్ కె. రాజ్య లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు