-ఆకర్షణయంగా జపాన్ దేశ ముఖద్వారం…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చేనేత హస్త కళా రంగా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. శాతవాహన కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన మణికంఠ ట్రేడ్ ఫెయిర్ వింటర్ ఎగ్జిబిషన్ ను శనివారం సెంట్రల్ నియోజవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు లాంచనంగా ప్రారంభించారు. జపాన్ ముఖద్వారంతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల స్టాల్స్, చేనేత హస్తకళల స్టాల్స్ ను సందర్శించి ధరల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగ్జిబిషన్ కు వచ్చిన సందర్శకులకు జపాన్ లో ఉన్న అనుభూతి కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
వింటర్ ఎగ్జిబిషన్ ను నగరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. వైసీపీ ప్రభుత్వం చేనేత హస్త కళారంగా అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందనిఆయన పేర్కొన్నారు. కలంకారి వస్తువులను ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు. తదనంతరం ప్రదర్శన నిర్వాహకులు సయ్యద్ అనీఫ్ అయ్యప్ప రెడ్డి మాట్లాడుతూ జపాన్ ముఖద్వారంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రదర్శనలో కలంకారీ బెడ్ షీట్స్, హర్యానా పానిపట్ సారంగాపూర్ ప్రాంతాలకు చెందిన కళాకారులు తయారుచేసిన వస్తువులు ఎగ్జిబిషన్లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఏటికొప్పాక బొమ్మలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని,జ్యువెలరీ కాస్పెటిక్ ఐటమ్స్ మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
ముఖ్యంగా చిన్నపిల్లల కోసం ఏర్పాటుచేసిన సెల్ఫీ షో ప్రదర్శనలో హైలెట్ గా ఉంటుందని వారు పేర్కొన్నారు. మేరీ కొలంబస్, జెయింట్ వీల్, రష్యన్ టోరాటోరా వాటర్ బోటింగ్, వాటర్ బోరట్ షికార్, ఎయిర్ బౌన్సర్ పిల్లల ఆటవిడుపు కోసం ఏర్పాటు చేశామని వారు తెలియజేశారు. ఫిబ్రవరి నెల 12వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కుక్కల అనిత, శాతవాహన కాలేజ్ కరస్పాండెంట్ నిడుమోలు రమా సత్యనారాయణ ఎగ్జిబిషన్ నిర్వాకులు అడపా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.