-జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరువ చేయడంలో అధికారులు ఉద్యోగులు సమన్వయంతో పనిచేసి మెరుగైన సేవలందించడం ద్వారా అభివృద్ధిలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేద్దామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. ఏపిఎన్‌జివో అసోసియేషన్ ఎన్‌టిఆర్ జిల్లా విజయవాడ నగరశాఖ నూతన సంవత్సర క్యాలెండర్లను జిల్లా కలెక్టర్ డిల్లీరావు గురువారం ఆయన కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా ను అభివృద్ధి పదంలో అగ్రగామిక నిలపడంలో ఉద్యోగుల సహకారం ఎంతో కీలమైనదన్నారు. జిల్లా యంత్రాంగం ఉద్యోగులకు అప్పగించిన లక్ష్యాలను సాధించడంలో మరింత కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు చేరువ చేయడంలో ఉద్యోగులు సహకారం ఎంతో అవసరమన్నారు. పారదర్శకమైన సేవలను అందించి జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పదంలో నిలిపేందుకు సమిష్టిగా కృషి చేదామని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అన్నారు. ఏపిఎన్‌జివో జిల్లా అధ్యక్షులు ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రజలకు సేవలందించడంలో జిల్లాకు చెందిన ఉద్యోగులకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. దైనందిక విధులతో పాటు జిల్లా యంత్రాంగం నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సిద్దంగా ఉంటారన్నారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేసేందుకు ఉద్యోగులుగా తమ వంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏపిఎన్‌జివో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి యండి ఇక్బాల్, కార్యవర్గ సభ్యులు పి. రమేష్, బి. సతీష్ కుమార్, యం రాజుబాబు, జి. రామకృష్ణ, డి. విశ్వనాథ్, సిహెచ్ దీలిప్‌కుమార్, డివి రమణ, వై రవి, నగర కార్యవర్గ సభ్యులు సిహెచ్. శ్రీరామ్, కె. సంపత్‌కుమార్, నజీర్‌ఉద్దీన్, వి.వి.ప్రసాద్, రాజా చౌదరి, కాశీమ్, సిహెచ్ వి. ప్రసాద్, గణేష్, వరప్రసాద్, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.