Breaking News

జగనన్న గృహ నిర్మాణ పథకం, పనుల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా

-గృహ నిర్మాణం, ప్రాధాన్యత భవనాల నిర్మాణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి
-జగనన్న హౌసింగ్ కాలనీల నిర్మాణ పనుల్లో పురోగతి సాధించాలి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు పేదలందరికి జగనన్న గృహ నిర్మాణ పథకం, పనుల ప్రక్రియను వేగవంతంగా, యుద్ధప్రాతిపదికన చేసి.. లక్ష్యాన్ని అధిగమించాలని.. జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.
బుధవారం సాయంత్రం కలెక్టరేట్ వీడియోకాన్ఫరెన్స్ హల్లో జరిగిన మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో గృహ నిర్మాణం, ప్రాధాన్యత భవనాలు, గడప గడపకు మన ప్రభుత్వం, కొనసాగుతున్న అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై ఆయన విస్తృతంగా సమీక్షించారు.
తొలుత ఆయన జగనన్న కాలనీలు, నిర్మాణ పురోగతి, మౌలిక వసతులు, జగనన్న సంపూర్ణ గృహహక్కు, ఓటీఎస్ ప్రక్రియల యాక్షన్ ప్లాన్ తో పాటు.. అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలు తీరు, పురోగతి తదితర అంశాలపై.. మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి ప్రత్యేక అధికారులు, హౌసింగ్ ఇంజినీర్ అధికారులతో జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా వీడియో కాన్ఫరెన్స్ జిల్లాలోని పలు శాఖల అధికారులతో సంభాషించారు
కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తోపాటు.. జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు హాజరయ్యారు.
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు కార్యక్రమం, పౌర సేవలు, సంక్షేమ పథకాలు.. ప్రజలకు సంతృప్త స్థాయిలో అందేలా.. ప్రతి అధికారి నిబద్ధతతో పని చేయాలన్నారు. లక్ష్య సాధన కోసం మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి సారించి.. ప్రతి వారం ప్రగతి నివేదికలు అందజేయాలన్నారు. ఈ సందర్భంగా.. మండలాలు, మున్సిపాలిటీల పరిధిలోని లే అవుట్లలో గృహ నిర్మాణ పనుల పురోగతిపై కలెక్టర్ ఒక్కొక్కరిని అడిగి తెలుసుకున్నారు. వర్షాలు ఆగిపోయి దాదాపు నెల రోజుల పైనే అయిందని పనుల్లో చురుకుదనం ఆశించిన స్థాయిలో లేకపోవడంపై కలెక్టర్ మండిపడ్డారు. ఉయ్యూరు పెడన మున్సిపాలిటీ కమిషనర్లతో ఆయన మాట్లాడుతూ, పనులు మంజూరై ఏడాదికాలం దాటినప్పటికీ నాన్ ఓ టి ఎస్ పనులు పూర్తి కాలేదన్నారు. ఈ విషయమై ఏం చర్యలు తీసుకుంటున్నారు అని సంబంధిత కమిషనర్లను నిలదీశారు. గ్రౌండింగ్, మెటీరియల్, ఫైనాన్స్ అసిస్టెన్స్ మొదలైన అన్ని రకాల సదుపాయాలను సమకూర్చి.. నిర్మాణ పలనులను లక్ష్యం మేరకు పూర్తి చేయాలని ఆదేశించారు. అధికారులు సమావేశానికి వచ్చేముందు సమగ్ర నివేధికాలతో అవగాహన కలిగి అడిగిన ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం చెప్పాలని కలెక్టర్ అన్నారు. పేదల ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి కనిపించాలని, అలసత్వం వహించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవన్నారు. ప్రారంభంకాని ఇళ్లన్నీ సత్వరమే ప్రారంభించి పునాది స్థాయికి తీసుకురావాలన్నారు. ప్రారంభంకాని ఇళ్లన్నీ సత్వరమే ప్రారంభించి బిబిఎల్ స్థాయిలో ఉండేలా చూడాలన్నారు. పేదల ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోని పనిచేయాలన్నారు. జగనన్న గృహ నిర్మాణాలలో ముఖ్యంగా విద్యుత్, నీటి సరఫరాకు సదుపాయాలను సమకూర్చాలన్నారు. గృహ నిర్మాణ పనుల్లో అధికారులు చిత్త శుద్దితో పనిచేసి నిర్దేశించిన, ఆశించిన పురోగతిని చూపిస్తూ.. ప్రతి అంశాన్ని ఆన్ లైన్ లో నమోదు చేయాలన్నారు.
ప్రాధాన్యతా భవన నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి పనులు పూర్తి చేయాలన్నారు.
ఈ కార్‌్క్ర‌మంలో జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వర్ నాయక్, డిఎంహెచ్ఓ డాక్టర్ గీతాబాయి, డీఈఓ తహెరా సుల్తానా, పలువురు ఎంపీడీవోలు తాహిసిల్దారులు, ఎస్ఈలు పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, అనుబంధ శాఖల అధికారులైన నియోజకవర్గ, మండల ప్రత్యేకధికారులు తదితరులు హాజరయ్యారు.

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *