విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనవరి 12 శ్రీకాకుళం రణస్థలం వద్ద జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించే యువశక్తి కార్యక్రమం నకు సంబంధించిన పోస్టర్ ను విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్ వద్ద జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ వివిధ డివిజన్ అధ్యక్షులు నగర కమిటీ సభ్యులు అమ్మవారి ధార్మిక సేవ మండలి సభ్యులు అధికార ప్రతినిధులు లీగల్ సెల్ ఐటి జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్లు తో కలసి విడుదల చేసినారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ యువశక్తి కార్యక్రమం విజయోత్సవం తర్వాత జనసేన తడాఖా ఏంటో వైసీపీకి చూపిస్తామని,యువతకు భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకే యువశక్తి కార్యక్రమం పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నారని,మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం మన యువత కోసం యువశక్తి కార్యక్రమని,జాబ్ లెస్ క్యాలెండర్ ను విడుదల చేసి యువత భవిష్యత్తుపై జగన్ గొడ్డలి వేటు వేశారని, 2.30 లక్షల ఉద్యోగాల భర్తీ cm ఎప్పుడు చేస్తారని, ప్రత్యేక హోదా తెస్తానని యువభేరీలు నిర్వహించి యువతను నమ్మించి మోసం చేసిన ద్రోహి సీఎం జగన్ నని, రాష్ట్రంలో రోజురోజుకీ నిరుద్యోగం పెరిగిపోతుంది. 32 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తు పై నీలి నీడలు ముకున్నాయని, రాష్ట్రంలో యువతకు జగన్ ఇచ్చిన ది నెలకు ఐదువేల రూపాయల వాలంటీర్లు ఉద్యోగాలు, బీరు బ్రాందీ సీసాలు అమ్ముకునే ఉద్యోగాలని,గంజాయి హెరాయిన్ నాటు సారా అమ్మకాలతో యువతను నిర్వీర్యం చేస్తున్నారని, రాష్ట్రంలో 400 మందికి పైగా ఒక్క ఏడాదిలోనే నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే జగన్ పాలనలో యువత ఎంత నిరాశ నిస్పృహల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కృష్ణా పెన్నా మహిళా కోఆర్డినేటర్ రావి సౌజన్య మాట్లాడుతూ యోశక్తి కార్యక్రమం రాష్ట్ర రాజకీయాలను మారుస్తుందని పవన్ కళ్యాణ్ వెంట యువత పెద్ద ఎత్తున నడుస్తారని పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో యువత నడుచుకోవాలని పిలుపునిచ్చారు. మరొక కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి మాట్లాడుతూ జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి ప్రభుత్వం జీవో ఇవ్వదు గానీ ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు జీవోలు జారీ చేస్తుందని, సినిమా టికెట్ల ధరల నియంత్రణపై జీవోలు జారీ చేస్తుంది గాని ప్రజలకి ఉపయోగపడే మద్యం అమ్మకాల నియంత్రణపై జీవోలు జారీ చేయదని, జగన్ పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు జీవితాలు అతలాకుతలమయ్యాయి అన్నారు. డివిజన్ అధ్యక్షులు తమ్మిన లీలా కరుణాకర్, ఏలూరు. సాయి శరత్, మల్లెపు విజయలక్ష్మి, బొమ్ము రాంబాబు, కొరగంజి వెంకటరమణ, అడ్డూరి తమ్మారావు, రెడ్డిపల్లి గంగాధర్, సోనీ గోవింద్, పొట్నూరి శ్రీనివాసరావు, సింగినంశెట్టి రాము గుప్తా, భవానిశంకర్, నరేంద్ర, కెంబూరి కృష్ణ, పైలా ప్రకాష్, వెంపటి ప్రభుజి, బాడిత శంకర్, నగర ఉపాధ్యక్షులు కామల్ల సోమనాథం, నగర అధికార ప్రతినిధి స్టాలిన్ శంకర్ నగర కమిటీ సభ్యులు సయ్యద్ ముబీన గన్ను శంకర్ శానంపూడి శిరీష రేవడి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …