Breaking News

పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అనేది భగవంతుడికి చేసే సేవలతో సమానం : గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అనేది భగవంతుడికి చేసే సేవలతో సమానమని గౌ. ఆం.ప్ర రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక ఎస్.వి.మెడికల్ అల్యూమిని అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన డిజిటల్ లైబ్రరీ శంకుస్థాపన మరియు డా. సుబ్రమణ్యం, సునీత, శ్రీధర్ రాజు, సుభాషిణి వారి ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన ఆడిటోరియంను గౌ. ఆం.ప్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రారంబించారు.

ఈ సంధర్భంగా గవర్నర్ మాట్లాడుతూ… ఎస్వీ మెడికల్ కాలేజీ కొత్త ఆడిటోరియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, హృదయపూర్వక శుభాకాంక్షలు అన్నారు . ఎస్వీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం మెడికల్ స్టూడెంట్స్ కోసం డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు కొరకు నేడు తన చేతుల మీదుగా పునాది వేయడం చాలా సంతోషంగా ఉన్నదని, వివిధ సూపర్ స్పెషాలిటీలపై అనేక జాతీయ మరియు అంతర్జాతీయ సదస్సులను విజయవంతంగా నిర్వహించడం కోసం డాక్టర్. రాయపు రమేష్ బాబు నేతృత్వంలోని ఎస్వీ మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు చేపట్టిన కార్యక్రమాలను అభినందిస్తున్నానని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి హౌస్ సర్జన్ కూడా పూర్తి చేశారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. సూపర్ స్పెషాలిటీ సేవలు ఎంతో గొప్పగా ఉన్నాయని , అల్యూమిని అసోసియేషన్ వారి సేవలు చాలా బాగా ఉన్నాయని కొనియాడారు. తన చేతుల మీదుగా గతంలో 27 ఫిబ్రవరి 2022 న ఇంటర్నేషనల్ న్యూరో సర్జరీ కాన్ఫరెన్స్ ను ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. వైద్యులు పేదలకు అందించే సేవలు ఎంతో ప్రాధాన్యత ఉందని వారికి సమాజంలో గొప్ప బాధ్యత ఉందని, కొవిడ్ 19 విపత్తు సమయంలో గౌ. ప్రధానమంత్రి గారు ప్రజలను విపత్తు నుండి కాపాడాల్సిన బాధ్యత మన వైద్యులపై,మన అందరిపై ఉందని పిలుపునిచ్చారు అన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని అన్నారు.

కోవిడ్ 19 విపత్తు సమయంలో ఫ్రంట్ లైన్ వర్కర్స్ సేవలు ఎంతో గొప్పగా అందించడం వలన ఈ విపత్తు నుండి మనం కోలుకోగలిగమని అన్నారు. మన దేశంలోని వైద్యులు అంతర్జాతీయంగా మంచి నైపుణ్యం కలిగి ఉన్నారని అన్నారు. చైనా దేశంలో నేడు 4 వ ఫేస్ కోవిడ్ 19 తో ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, అక్కడ పరిస్థితి చేయి దాటిపోయిన పరిస్థితులలో, మన దేశంలో మన వైద్య రంగం ఈ విపత్తును ఎదుర్కొనేందుకు అన్ని విధాల సంసిద్ధంగా ఉందని ఎంతో గర్వంగా చెప్పగలను అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు దేశంలోని ఇతర రాష్ట్రాలలో ప్రాక్టీస్ చేస్తున్న వైద్యులు, వైద్య సోదరులు మరియు వైద్య విద్యార్థుల ఎస్.వి. మెడికల్ కాలేజీల పూర్వ విద్యార్థుల సంఘం యొక్క భవిష్యత్తు, వైద్య విద్యా కార్యకలాపాలు మరియు ప్రయత్నాలు అన్నీ విజయవంతమవాలని కోరుకుంటున్నానని అన్నారు. తిరుపతి ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ మొదలైన సూపర్ స్పెషాలిటీ మెడిసిన్‌లోని వివిధ రంగాలలో SVMC పూర్వ విద్యార్థుల సంఘం జాతీయ మరియు అంతర్జాతీయ సమావేశాలను నిర్వహించిందని, ఈ వైద్య రంగాలలో నిపుణులైన ఫ్యాకల్టీ సభ్యులు ఈ సమావేశాలలో తమ ఉపన్యాసాలు ఇచ్చారని, దాదాపు 25,000 మంది ప్రతినిధులు పాల్గొన్నారని నూతన వైద్య విదాన సమాచారం పంచుకున్నారని తనకు తెలిసిందని, ప్రాక్టీస్ చేసే వైద్యులు, పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులు, IMA వైద్యులు మరియు భారతదేశం మరియు విదేశాలలోని మెడికల్ కాలేజీల బోధనా ఫ్యాకల్టీల ప్రయోజనం కోసం , నైపుణ్యం కోసం S.V.M.C గణనీయమైన సహకారం అందించి , పూర్వ విద్యార్థుల సంఘం అందరిచే గుర్తింపు పొందిందని, మరియు ఈ సంఘం గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీజీ నుండి ప్రశంసలను పొందిందని తనకు తెలిసిందని, ఈ గొప్ప విజయం వెనుక ఉన్న డాక్టర్ రమేష్ మరియు టీమ్ సభ్యులను నేను అభినందిస్తున్నానని అన్నారు.
తన ప్రసంగం ముగిస్తూ కార్ల్ జంగ్ గారి మాటలు గుర్తు చేస్తూ మందులు రోగాన్ని నయం చేస్తాయి కానీ డాక్టర్లు మాత్రమే రోగులకు చికిత్స చేసి నయం చేయగలరు అని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు సభ్యులు శ్రీ మద్దిల గురుమూర్తి, గవర్నర్ స్పెషల్ సి ఎస్ ఆర్పీ సిసోడియా, కలెక్టర్ కె. వెంకట రమణ రెడ్డి, తిరుపతి శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి, ఎస్.వి. మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు, డా. ఆర్.రమేష్ బాబు, ఎస్.వి. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.ఎ. చంద్రశేఖరన్, రుయా ఆసుపత్రి ఇంచార్జ్ సూపరింటెండెంట్ సురేశ్వర్ రెడ్డి, ఎస్.వి. మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సంఘం విద్యార్థులు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *