విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పెన్షన్ దారులు యాన్యూల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అందజేసేందుకు నగరంలో గాంధీనగర్ డివిజనల్ ఉప ఖజానా కార్యాలయంలో ఆరు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసిన్నట్లు జిల్లా ఖజానా మరియు లెక్కల అధికారి యం హెచ్ రహిమాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం, జిల్లా కలెక్టర్, ఖజానా లెక్కల కార్యాలయ సంచాలకుల ఆదేశాల మేరకు పెన్షన్ దారులు యాన్యూల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అందించే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా డివిజనల్ ఉప ఖజానా కార్యాలయంలో ఈనెల 1వ తేది నుండి ఏర్పాటు చేసిన ఆరు ప్రత్యేక కౌంటర్లను పెన్షన్ దారులు ఫిబ్రవరి 28వ తేది లోపు వినియోగించుకోవాలన్నారు. బయోమెట్రిక్, ఐరిస్ పనిచేయని వారికి విజయవాడ ఈస్ట్ ట్రేజరీలో ఫ్‌స్ యాప్‌ద్వారా లైఫ్ సర్టిఫికెట్ తీసుకోవడం జరుగుతుందన్నారు. పెన్షన్‌దారులు వారు సమర్పించే లైఫ్ సర్టిఫికేట్లను కేంద్ర ప్రభుత్వం జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా మీ`సేవా కేంద్రలలోను పోస్టు ఆఫీసులోను, నెట్ సెంటర్లలో నమోదు చేసుకోవచ్చునన్నారు. అంతే కాకుండా పెన్షన్‌దారులు తమ వ్యక్తిగత మొబైల్ ఫోన్‌లలో జీవన్ ప్రమాణ్ ఫేస్ యాప్ ద్వారా కూడా నమోదు చేసుకోవచ్చునని జిల్లా ఖజానా మరియు లెక్కల అధికారి యం హెచ్ రహిమాన్ ఆ ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …