Breaking News

విద్యుత్ బస్సులో ప్రయాణించిన జిల్లా కలెక్టర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి గత సంవత్సరం సెప్టెంబర్ 07న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా విద్యుత్ బస్సులను ప్రారంభించారని నేడు కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరుమల నుండి తిరుపతి వరకు విద్యుత్ బస్సులో ప్రయాణించామని సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లాలో దాదాపు 100 బస్సులు కేటాయింపు జరిగిందని ఇందులో 50 బస్సుల వరకు కేవలం తిరుపతి – తిరుమల , మరో 14 రేణిగుంట విమానాశ్రయం నుండి తిరుమలయాత్రికుల కోసం ఏర్పాటు చేస్తున్నారని తిరుపతి నుండి మదనపల్లి కడప నెల్లూరు ప్రాంతాలకు మరో 12 విద్యుత్ బస్సులు వంతున నడపనున్నామని అన్నారు. నేడు విద్యుత్తు బస్సులో ప్రయాణికులను పలకరించగా కారు కన్నా సుఖవంతమైన ప్రయాణం ఇందులో ఉందని అభిప్రాయాలు వ్యక్తం చేశారని అన్నారు. విద్యుత్ బస్సుల నిర్వహణ కోసం ఐదు ఎకరాల స్థలం కేటాయింపు చేయనున్నట్లు తెలిపారు. పర్యావరణ పరంగా కాలుష్యం తగ్గడంతోపాటు సుఖవంతమైన ప్రయాణం ఈ విద్యుత్ బస్సులలో ఉందని అన్నారు. జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యుల ప్రయాణ సమయంలో జిల్లా ప్రజా రవాణా అధికారి చెంగల్ రెడ్డి, సిటిఎం భాస్కర్ రెడ్డి , బస్సుల నిర్వహణ సిబ్బంది వీరబాబు , మహేష్ , డ్రైవర్ మురళిలను జిల్లా కలెక్టర్ అభినందిం చారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *