తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి అన్నారు. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమoలో కలెక్టర్, జే సి డి కే బాలాజీ తో కలిసి పాల్గొని జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీ దారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం అర్జీలు 75 రాగా ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 49 , పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి 8, పోలీసు శాఖ కు సంబంధించి 2, విద్యుత్ శాఖకు సంబంధించి 1, డి.సి.హెచ్ ఎస్ కు సంబంధించి 1, హౌసింగ్ కు సంబంధించి 2, మున్సిపల్ కమిషనర్ కు సంబంధించి 4, ఉపాధి కి సంబంధించి 3, జిల్లా సాంఘీక సంక్షేమ శాఖ కు సంబంధించి 1,దేవాదాయ శాఖ కు సంబంధించి 1, రిజిస్ట్రేషన్ శాఖ కు సంబంధించి 1, డి.ఎం.డబ్ల్యు. ఓ కు సంబంధించి 1, ఐ.సి.డి.ఎస్ కు సంబంధించి 1 అర్జీలు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు గైకొని పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ శ్రీనివాస రావు వివిధ శాఖలకు సంబందించిన అధికారులు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …