Breaking News

ఉగాది నాటికి గృహ ప్రవేశాలకు సిద్దం కావాలి : స్పెషల్ సి.ఎస్ అజయ్ జైన్

శ్రీకాళహస్తి/తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం నవరత్నాలు – పేదలందరికీ ఇల్లు లో భాగంగా గౌ.రాష్ట్ర ముఖ్య మంత్రి ఆదేశాల మేరకు ఉగాది నాటికి రాష్ట్రంలో ఐదు లక్షల గృహాలు గృహ ప్రవేశాలు చేపడుతున్న నేపథ్యంలో తిరుపతి జిల్లాలో ఉగాది నాటికి నిర్దేశించిన లక్ష్యాల మేరకు గృహ ప్రవేశాలకు సిద్దం కావాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు.

మంగళవారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి నియోజకవర్గం ఊరందూరు జగనన్న కాలనీ లేఔట్ లో సంబంధిత అధికారులతో కలసి ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పర్యటించి పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా ప్రత్యేక ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి సూచించిన మేరకు, తిరుపతి జిల్లాకు సంబంధించి ఉగాది నాటికి సుమారు 24 వేల సాముహిక గృహ ప్రవేశాలు జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఊరందూరు లేఅవుట్ కు సంబంధించి 6231 ఇంటి స్థలాలను మంజూరు చేసిన, 4873 మంది పేదలకు గృహాలను మంజూరు చేసిన వాటికి కేటగిరి -3 కింద గృహ నిర్మాణాలు వేగావంతానికి కృషి చేయాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 9 వేల గృహాలు ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయని సంబంధిత అధికారులు తెలుపగా, మిగిలినవి ఉగాది నాటికీ ప్రారంబించేలా చూడాలని, నేటినుండి 70 రోజులు సమయం మాత్రమే ఉందని అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి లక్ష్యాలను అందిపుచ్చుకోవాలి అని స్పెషల్ సి ఎస్ ఆదేశించారు.

జగనన్న కాలనీలలో మౌలిక వసతులు విద్యుత్, తాగు నీటి వసతి, అంతర్గత రహదారులు, మురికి కాలువలు పూర్తి స్థాయిలో ఏర్పాటు కావాలని కాలనీలో స్వాగత ద్వారం ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సూచించారు. వీరి పర్యటనలో హౌసింగ్ మరియు నరేగా పి.డి శ్రీనివాస ప్రసాద్, ఈ.ఈ చంద్రశేఖర్ బాబు, మునిసిపల్ కమిషనర్, ఎం.పి.డి.ఓ లు, విద్యుత్ శాఖ, హౌసింగ్ ఏ.ఈ లు, వర్క్ ఇన్స్పెక్టర్ లు, వార్డ్ అమినిటి సేక్రటరీ లు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *