తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 11 న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి చిరు వ్యాపారులకు, సాంప్రదాయ చేతి వృత్తులవారికి జగనన్న తోడు పథకం ద్వారా పెట్టుబడి అవసరాల కోసం రుణం తీసుకుని బ్యా౦కులకు సకాలంలో చెల్లించిన వారికి ప్రభుత్వం వడ్డీ జమ కార్యక్రమంలో భాగంగా జగనన్న తోడు 6 వ విడత ‘వడ్డీ రీఇంబర్స్మెంట్ ’ లబ్ది దారుల ఖాతాలకు జమ చేయనున్నారని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11 న రాష్ట్ర ముఖ్యమంత్రి తాడే పల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న తోడు వడ్డీని కంప్యూటర్ బటన్ నొక్కి జమ చేసే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్ నుండి ఉదయం 11 గంటలకు వీక్షించే విధంగా ఏర్పాటు చేసామని, డి.ఆర్.డి.ఏ ద్వారా గ్రామీణ మరియు మెప్మా ద్వారా పట్టణ ప్రాంతాల చిరు వ్యాపారులు తీసుకున్న రుణాలు రూ. 34.24 కోట్లకు గాను జిల్లాలో 34,243 మంది చిరు వ్యాపారులకు రూ. 78,66,685/- వడ్డీ రీఇంబర్స్మెంట్ లబ్ది కలగనున్నదని తెలిపారు.
Tags tirupathi
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …