-తొలి డి ఎల్ ఏ ఎమ్ పర్యవేక్షణ కమిటీ సమావేశం
-అభ్యంతరాలు నమోదు కోసం 1947 టోల్ ఫ్రీ నెంబర్
-ప్రచార పోస్టర్ ఆవిష్కరణ
-జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ప్రభుత్వం ఆధార్ సంఖ్య కు సంబంధించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అనుసరించి చేపట్టిన అభివృద్ధి మేరకు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి తప్పని సరిగా బయో మెట్రిక్ వివరాలు నవీకరణ చేసుకోవలసి ఉందని జిల్లా కలెక్టర్ & డి ఎల్ ఏ ఎమ్ పర్యవేక్షణ కమిటీ చైర్మన్ డా కె. మాధవీలత విజ్ఞప్తి చేశారు.
గురువారం రాత్రి స్థానిక కలెక్టర్ కార్యాలయ ఛాంబర్ లో తొలి జిల్లా స్థాయి ఆధార్ పర్యవేక్షణ కమిటీ ( డి ఎల్ ఏ ఎమ్ సి) సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ యూ డి ఐ ఎ వారి ఆదేశాల మేరకు ప్రతి పది సంవత్సరాల కి తప్పనిసరిగా ఆధార్ కార్డు సంఖ్య తో బయో మెట్రిక్ నవీకరణ చేసుకోవాలన్నారు. ఇందుకోసం జిల్లా స్థాయి లో కలెక్టర్ చైర్మన్ సంబంధిత శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. తొలి సమావేశంలో భాగంగా ఆయా అధికారులకు దిశా నిర్దేశం చేశామన్నారు. డివిజన్, మండల స్థాయి లో ప్రత్యేక అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మార్చి 31 లోగా ఎటువంటి రుసుము వసూలు చెయ్యకుండా ఉచితంగా నవీకరణ చెయ్యడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు ఆధార్ సంఖ్య లేని ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ఆధార్ సంఖ్య పొందాలని కోరారు . ఇందుకు సంబంధించిన గోడ ప్రతులను కలెక్టర్ ఆవిష్కరించి విడుదల చేశారు. ప్రచార పోస్టర్ ఆవిష్కరణ 2006 నుంచి 2010 మధ్య ఆధార్ కార్డు పొందిన వారు సమీపంలో ఉన్న ఆధార్ కేంద్రానికి వెళ్లి వారి వివరాలతో నవీకరణ చేసుకోవాలని సూచించారు. O-5 సం.ముల వాళ్ళు తప్పని సరిగా ఆధార్ సంఖ్య పొందవలసి ఉందని ఇందుకోసం n ప్రభుత్వ, ప్రవేటు ఆసుపత్రుల ద్వారా కూడా ఉచితంగా నమోదు చేస్తారని అన్నారు. 5- 15 సం.ములు, 18 సం. ములు వయస్సు ఉన్న వారుకూడా తప్పనిసరిగా నవీకరణ చేసుకోవలెను. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉన్న 246 ఆధార్ కేంద్రాలు నవీకరణ కోసం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ముఖ్యంగా నాలుగు అంశాల ప్రాతిపదికన ఆధార్ నవీకరణ చేసుకోవలసిన అవస్యకత పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడానికి జిల్లా స్థాయి కమిటీ ఆధ్వర్యంలో డివిజన్, మండల స్థాయి లో ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టవలసి ఉంటుందన్నారు.
1) 2010-2016 మధ్య ఆధార్ కార్డు పొందిన వారు
2) 5 నుంచి 15 సం.ముల లోపు వారు తప్పనసరిగా బయో మెట్రిక్ వివరాలు నవీకరణ చేసుకోవాలి
3) మార్చి 31 వరకు నవీకరణ కి ఎటువంటి రుసుము వసూలు చేయడం జరగదు
3) 0-5 సం.ముల లోపు వారికి ఆధార్ సంఖ్య తప్పని సరి..
4) ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదు ప్రక్రియ చేపట్టడం జరుగుతోంది
5) అభ్యంతరాలు నమోదు కోసం 1947 టోల్ ఫ్రీ నెంబర్
జిల్లా కమిటీ స్వరూపం,:
కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ ఛైర్మన్, కన్వీనర్ గా ఆర్డీవో రాజమహేంద్రవరం, సభ్యులుగా జిల్లా ఎస్పీ, ఎల్ డి ఎం, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్, డి ఎల్ డి వో, రాజమహేంద్రవరం, విద్య, వైద్య, శిశు సంక్షేమ అధికారులు, సీనియర్ పోస్టల్ శాఖ అధికారులు, యు ఐ డి ఎ ఐ ప్రతినిధి, ఆర్డీవో కొవ్వూరు లు వ్యవహరిస్తారు.
ఈ రోజు నిర్వహించిన తొలి సమావేశానికి జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు, ఆర్డీవో లు ఎస్. మల్లిబాబు, ఏ. చైత్ర వర్షిణి, అదనపు ఎస్పీ కె.. పాపారావు,యుఐడిఎఐ హైదరాబాద్ అసిస్టెంట్ మేనేజర్ వరప్రసాద్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కే. విజయ కుమారీ, డి ఎల్ డి వో పి. వీణా దేవి, ఎల్.డి.ఎం. – జీ దీలిప్ కుమార్, విద్య, వైద్య, పోస్టల్, పోలీస్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.